కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నేత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దళిత నేతగా బూటా సింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. 1986 నుంచి 1989 వరకు ఆయన రాజీవ్ గాంధీ క్యాబినెట్‌లో హోంశాఖ మంత్రిగా చేశారు. 1984 నుంచి 1986 వరకు బూటా సింగ్.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడా చేశారు. 2004 నుంచి 2006 వరకు బీహార్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బూటా సింగ్ మృతిపట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. నిజమైన ప్రజా సేవకుడిని కోల్పోయినట్లు తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో బూటా సింగ్‌తో అత్యంత సాన్నిహిత్యం ఉన్నది. 1962లో ఆయన తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
బూటా సింగ్ తొలిసారిగా అకాళీదళ్ సభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన… 1960లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1962లో మూడో లోక్‌సభకు ఆయన సుధ్నా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నో పదవులు అలంకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూర్ కాస్ట్‌కి 2007-2010 మధ్య అధ్యక్షుడిగా కూడా చేశారు. పంజాబీ సంస్కృతిపై ఆయన చాలా ఆర్టికల్స్ రాశారు. సిక్కుల చరిత్రపైనా రాసిన ప్రతులున్నాయి. పంజాబీ స్పీకింగ్ స్టేట్ పేరుతో ఆయన ఓ పుస్తకం కూడా రాశారు.