చాటుగా వినడంతో గుట్టురట్టైంది.. అసలు నిజం తెలుసుకున్న రష్మీ

Bullet Bhaskar Comment On Rashmi In Extra Jabardasth

ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్కిట్స్ వేస్తుంటారు. స్కిట్లు రాయడానికి పడే పాట్లనే స్కిట్లుగా మలుస్తుంటారు.. ఇంకొందరు జబర్దస్త్ స్టేజ్ వెనకాల జరిగే వాటినే తమ స్కిట్లలో వేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ స్కిట్‌నే వేశారు. సత్తి పండు కలిసి చేసే స్కిట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. చమ్మక్ చంద్ర వెళ్లాక సత్తిపండు అదే ఫార్మూలాతో ఎక్స్ ట్రా జబర్దస్త్ స్కిట్లు వేస్తూ నడిపిస్తున్నాడు.

Bullet Bhaskar Comment On Rashmi In Extra Jabardasth
Bullet Bhaskar Comment On Rashmi In Extra Jabardasth

అయితే తాజాగా ఓ కొత్త స్కిట్‌ను వేసేందుకు ప్రయత్నించాడు. కొత్త ఏడాది సందర్భంగా ప్రసారం కాబోతోన్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో సత్తిపండు బాగానే స్కిట్‌ను నడిపించాడు. రష్మీ గురించి టీం లీడర్లందరూ చాటుగా ఏం అనుకుంటున్నార్ బయట పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మొదటగా బుల్లెట్ భాస్కర్ బుక్కయ్యాడు.

బుల్లెట్ భాస్కర్ తన టీంతో కలిసి స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సత్తి పండు లోపలకి వెళ్లి రష్మీ గురించి ప్రస్థావించాడు. కానీ రష్మీ డోర్ వెనకాల ఉందన్న సంగతి తెలియని బుల్లెట్ భాస్కర్ రెచ్చిపోయాడు. రష్మీ అంటేనే నాకు నచ్చదు..ఎప్పుడు స్కిట్ చేసినా బిక్కమొహం వేసుకుంటూ ఉంటుంది.. నవ్వమంటే కూడా నవ్వదు.. అంటూ బుల్లెట్ భాస్కర్ తన మనసులో ఉన్నదంతా కక్కేశాడు. ఆ మాటలు విన్న రష్మీ ఒక్కసారిగా షాక్ అయింది.