Heroine Bikini Punch : హీరోయిన్ దక్ష నగార్కర్ ఇటీవల ‘బంగార్రాజు’ సినిమాలో ఓ పాటలో మెరిసింది. అంతకు ముందు ‘జాంబీరెడ్డి’ తదితర సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే దక్ష, అడపా దడపా హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తుంటుంది.
ఓ నెటిజన్ దక్ష నగార్కర్‌ని బికినీ ఫొటో అడిగాడట. ఇంకేముంది.? తనదైన స్టయిల్లో ఓ బికినీ ఫొటో షేర్ చేసింది. అది ఆమె బికినీలో పోజిచ్చిన ఫొటో కాదు. ఇసుకలో బికినీ పరిచేసి వుంటుంది.. దానిపైన ఓ లేడీ షాడో కనిపిస్తుంటుంది. అలా ఆ సాడోకి బికినీ తగిలించినట్టుగా వుంటుందా ఫొటో.
సరే, ఈ ప్రాక్టికల్ జోక్ బాగానే వర్కవుట్ అయ్యింది.. నెటిజన్లు ఆమె తెలివికి ఫిదా అయ్యారు. అంతా బాగానే వుందిగానీ, ఈ క్రమంలో వచ్చిన మీమ్స్‌తో విపరీతమైన పబ్లిసిటీ చేసేసుకుంటూ వివాదాలకు తావిచ్చింది దక్ష నగార్కర్. ‘బికినీ పిక్ కావాలట ఎదవలకి..’ అంటూ ఓ మీమ్ పోస్ట్ చేసి వివాదాల్లోకెక్కింది ఈ బ్యూటీ.
వెంకటేష్ హీరోగా చాన్నాళ్ళ క్రితం వచ్చిన ‘మల్లీశ్వరి’ సినిమాలో సునీల్ – వెంకటేష్ మధ్య నడిచే ఓ సన్నివేశానికి చెందిన ఫొటో, డైలాగ్‌ని ఇలా వాడేశారు మీమ్ క్రియేటర్స్. దాన్ని దక్ష కూడా వాడేయడం వివాదాస్పదమయ్యింది.
మరీ, నెటిజన్లని ఎదవలుగా చిత్రీకరించడమేంటి.? అభిమానుల్ని ఇలాగే ట్రీట్ చేస్తావా.? అంటూ ఏకిపారేస్తున్నారు. ఎలాగైతేనేం, ఈ వివాదంతో కూడా తనకు పబ్లిసిటీ వస్తుందని ఆమె అనుకుని వుండొచ్చుగాక.