నాగ చైతన్య సినిమా పై పోలీస్ కంప్లైంట్

‘బంగార్రాజు’ సినిమాతో హిట్ కొట్టిన నాగ చైతన్య లాస్ట్ రిలీజ్ ‘థాంక్యూ’ మాత్ర భారీ ప్లాప్ గా మిగిలింది. ఇప్పుడు వెంకట్ ప్రభు సినిమాతో బిజీ గా ఉన్నాడు నాగ చైతన్య. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఒక షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో పూర్తి చేసుకుంది.

కానీ తర్వాత షెడ్యూల్ తో ఈ సినిమా చిక్కుల్లో పడింది. నెక్స్ట్  షెడ్యూల్ కోసం  మూవీ టీం కర్నాటక వెళ్ళింది. అయితే షూటింగ్ కి  ఇచ్చిన పర్మిషన్ ని కర్ణాటక రాష్ట్ర మండ్య జిల్లా పాలన యంత్రాంగం రద్దు చేసింది.

మేలుకోట సమీపంలో వైన్ షాప్ సెట్ వేసి, వివిధ బ్రాండ్ల వైన్ సీసాలను ఉంచి చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులతో చిత్రీకరణకు అనుమతి ఇవ్వగా.. సినిమా యూనిట్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ స్థానిక కన్నడ సంఘాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.