కృతి శెట్టి బాగా తగ్గించేస్తోందిటగా.!

బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ దెబ్బకి కృతి శెట్టి బాగా తగ్గించేస్తోందట. తగ్గించేయడమంటే, ఒకటి కాదు.. రెండు మూడు కోణాల్లో. అందులో బరువు తగ్గించుకోవడం కూడా ఒకటి అని అంటున్నారు.

ఔను, కృతి శెట్టి బాగా బరువు తగ్గిందట ఈ మధ్య. అంతకు ముందేమీ మరీ లావుగా లేదుగానీ, కాస్త బొద్దుగా వుండేదంతే. అది కూడా మిడిల్ పార్ట్‌లో. ఇప్పుడు ఆ పార్ట్ నాజూగ్గా తయారైందని అంటున్నారు.

ఇంకోపక్క రెమ్యునరేషన్ కూడా కృతి శెట్టి బాగా తగ్గించేసిందట. తగ్గించాలి మరి. డిమాండ్ చేసే పరిస్థితి లేనప్పుడు సర్దుకుపోవాలి. అదే సక్సెస్ వస్తే, అమాంతం రేటు పెరిగిపోతుంది.

మూడో తగ్గింపు, వస్త్రాల సైజు.. అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్లామర్ హద్దులు చెరిపేసి, వస్త్రాల్ని పొదుపు చేయాలనుకుంటోందిట కృతి శెట్టి. సో, తెరపై కృతి శెట్టి గ్లామర్ విశ్వరూపం చూడబోతున్నామట.