నాగార్జున కూడా అలాంటిది కావాలంటున్నాడట.!

ఇటీవల వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అక్కినేని నాగార్జున కన్ను పడిందట. ఈ తరహాలో కొడుకు నాగ చైతన్యతో కలిసి తానూ ఓ సినిమా చేస్తే ఎలా వుంటుందని ప్లాన్ వేస్తున్నాడట.

ఆ దిశగా ఆల్రెడీ కొంతమంది యంగ్ డైరెక్టర్స్‌ని లైన్‌లో పెట్టి వుంచాడట నాగార్జున. కథల కోసం పలువురు యంగ్ డైరెక్టర్స్‌తో తెర వెనుక గట్టిగా మంతనాలు చేస్తున్నాడనీ సమాచారం.

గతంలో చైతూతో కలిసి నాగ్ ‘మనం’, ‘బంగార్రాజు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘మనం’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ‘బంగార్రాజు’ ఫర్వాలేదనిపించింది. ఈ సారి అంతకు మించి అనేలా ఈ కాంబినేషన్ వర్కవుట్ చేయాలనుకుంటున్నాడట. ఈ కొత్త ప్లాన్‌కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్.

ప్రస్తుతం నాగ చైతన్య తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.