ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ లు ఆడి ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్థి..

ఈమధ్య ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ లు బాగా ఎక్కువయ్యాయి. దీంతో పాటు మరణాలు కూడా ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. బెట్టింగులు చేసి ఓడిపోవడం వల్ల డబ్బులు తీర్చలేక చివరికి ప్రాణాలే వదిలేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ బీటెక్ విద్యార్థి కూడా మరణించాడు. పలమనేర్ పట్టణంలోని గుడియాతం రోడ్డు భజంత్రీ వీధిలో నివాసముంటున్న బీటెక్ విద్యార్థి దిలీప్ రెడ్డి. అతని వయసు 20 సంవత్సరాలు.

ఇతడు ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఇక ఇతడితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు కూడా అతనితో ఉంటున్నారు. ఇతడు కొద్ది రోజులుగా ఆన్లైన్
బెట్టింగ్ గేమ్ లకు అలవాటు పడటంతో అప్పులు చేసి చివరకు తన మొబైల్ కూడా తాకట్టు పెట్టినట్లు తెలిసింది. దీంతో అతడు శుక్రవారం మధ్యాహ్నం తన గదిలో ఫ్యాన్ ను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ప్రస్తుతం అతని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.