AP: విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఎంతోమంది కూటమినేతలు సొంత పార్టీ నేతలు కూడా ఈయన రాజీనామా పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. విజయ్ సాయి రెడ్డి ఇలా ఉన్నఫలంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణం ఏంటి అనే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలా తాను రాజకీయాలకు దూరం కాబోతున్నానని రాజకీయాలకు సెలవు ప్రకటిస్తూ విజయసాయిరెడ్డి చేస్తున్న పోస్ట్ తర్వాత కొంత సమయానికి బీటెక్ రవి సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ తరపున గత ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఎన్నికలలో ఈయన ఓటమిపాలు అయ్యారు. ఇక విజయ సాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో బీటెక్ రవి ఈ విషయం గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
విజయ్ సాయి రెడ్డి రాజకీయాలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఆయన అప్రూవర్ గా మారటం ఖాయమని తెలిపారు. ఇలా ఈయన అప్రూవర్ గా మారితే పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి డిస్ క్వాలిఫై అవుతారని, దీంతో పులివెందులలో ఉప ఎన్నికలు కూడా వస్తాయని బీటెక్ రవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా విజయసాయిరెడ్డి ఏ టు నిందితుడిగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈయన అప్రూవర్ మారితే జగన్ పై తప్పనిసరిగా వేటుపడుతుంది తద్వారా ఆయన ఎమ్మెల్యేగా డిస్క్ క్వాలిఫై అవుతారు. ఎమ్మెల్యేగా డిస్క్ క్వాలిఫై అయితే తిరిగి కడపలో ఉప ఎన్నికలు జరుగుతాయని ఈయన తెలిపారు. ఇక వైసిపి విజయసాయిరెడ్డితో మాత్రమే కాదని ఈ పార్టీ నుంచి ఎంతోమంది నేతలు రాజీనామాలు చేసి బయటకు వస్తారని వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని బిటెక్ రవి తెలిపారు. పార్టీ నుంచి అందరూ బయటకు వస్తే తాడేపల్లిలో ఒక జగన్ మాత్రమే మిగులుతారు అంటూ ఈయన ఆరోపణలు చేశారు.
