Ramarao On Duty : బ్రేకింగ్ అప్డేట్ : “రామారావు ఆన్ డ్యూటీ” ఆగమనంకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.!

Ramarao On Duty : టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో ఏజ్ కి సంబంధం లేకుండా ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ని అందించే స్టార్ హీరోస్ లో మాస్ రవితేజ కూడా ఒకరు. రీసెంట్ గా అయితే “ఖిలాడీ” సినిమాతో పలకరించిన రవితేజ ఈ సినిమా లైన్ లో ఉండగానే మరిన్ని సాలిడ్ సినిమాలు తన లైనప్ లో పెట్టేసుకున్నారు.
అలాగే ఈ చిత్రాల్లో కొత్త దర్శకుడు అయినటువంటి శరత్ మందవతో ప్లాన్ చేసిన చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. పవర్ ఫుల్ సబ్జెక్టు తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ అప్డేట్ కూడా ఎవరినీ నిరాశ పరచలేదు.
మరి అలా నిన్ననే ఈ సినిమా నుంచి ఓ భారీ అనౌన్సమెంట్ ని అందిస్తున్నట్టుగా ఈరోజు ఉదయం 10 గంటల 8 నిమిషాలకి టైం ఫిక్స్ చేసి ఇప్పుడు ఆ అప్డేట్ ని రివీల్ చేశారు. మొదట ఈ సినిమాకి రెండు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ రెండు కాకుండా కొత్త రిలీజ్ కి సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ జూన్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసి మాస్ మహారాజ ఫ్యాన్స్ కి ఒక సాలిడ్ క్లారిటీ ఇచ్చేసారు. ఇక ఈ సినిమాకి కోలీవుడ్ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ సంగీతం అందివ్వగా రవితేజ కూడా ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.