బ్రేకింగ్ : తెరాస కు మేయర్ పీఠం లేనట్లే..? వేగంగా మారుతున్న రాజకీయం

hyderabad mayor

 గ్రేటర్ ఎన్నికల్లో గతంలో కంటే ఒక సీటు ఎక్కువే సంపాదిస్తామని ప్రగల్బాలు పలికిన తెరాస పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు గ్రేటర్ ఓటర్లు, గతంలో కంటే 45 సీట్లు తగ్గించి తమకు ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత ఏమిటో తెలియచేశారు, సరే తమకు ఇచ్చిన 55 స్థానాలతో మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్న తెరాస కు అది కూడా సాధ్యపడేలా కనిపించటం లేదు. ఎక్సఅఫిషియో సభ్యులను కలుపుకున్న కానీ మేయర్ స్థానానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ తెరాస అందుకోలేకపోతుంది.

trs car

 

ఎక్స్అఫిషియో అంటే ఏమిటి..?

గతంలో 99 స్థానాలు గెలవటంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తెరాస కు దక్కాయి, ప్రస్తుతం GHMC పరిధిలో 150 కార్పొరేటర్లు మరియు 45 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు. దీనితో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 98 ఓట్లు అవసరం. కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో ఎక్స్అఫిషియో నోటిఫికెషన్ ఇస్తారు ఇతర నగరపాలన సంస్థల్లో, పురపాలక సంఘాల్లో ఓటు వేయకుండా గ్రేటర్ పరిధిలో ఓట్లు కలిగి ఉన్నా నేతలకు ఇందులో అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులను కలుపుకున్న కానీ తెరాస కు 87 మంది సపోర్ట్ ఉంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ లకు ఇక్కడే ఓట్లు ఇచ్చిన కానీ మరో ఏడెనిమిది ఓట్లు అవసరం అవుతాయి. కాబట్టి తెరాస మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఇప్పుడు తలకు మించిన భారం అవుతుంది.

trs mim

ఏకైక అవకాశం : మజ్లీస్

తెరాస కు ఎక్స్అఫిషియో సభ్యుల మద్దతు కూడా అవసరం లేకుండా మేయర్ పీఠం దక్కాలంటే ఖచ్చితంగా మజ్లీస్ మద్దతు అవసరం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మజ్లీస్ పార్టీ బహిరంగంగా తెరాస కు మద్దతు ఇస్తుందా అనేది అనుమానము. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది, అదేమిటంటే మేయర్ ఎన్నిక నాడు ఆ రోజు సభకు ఎంత మంది అయితే హాజరు అవుతారో వాళ్లే ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మజ్లీస్ సభకు హాజరుకాని పక్షంలో తెరాస కు మేయర్ పీఠం దక్కుతుంది. ప్రస్తుతం ఈ దిశగానే ఆలోచన జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది.

 ఈ సారి మేయర్ పీఠం మహిళలకు రిజర్వేషన్ కావటంతో తెరాస లోని అనేక మంది మహిళా నేతలు దీనిపై ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. సింధు ఆదర్శ రెడ్డి ( భారతి నగర్ ) ఎంపీ కేకే కుమార్తె విజయలక్ష్మి ( వెంకటేశ్వర నగర్ కాలనీ ) మేయర్ రామ్మోహన్ భార్య శ్రీదేవి యాదవ్ ( చర్లపల్లి ) పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి (ఖైరతాబాద్ ) ఈ నాలుగులు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం సింధు ఆదర్శ రెడ్డి వైపు తెరాస అధినాయకత్వం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది.