ఇప్పుడే అందిన బ్రేకింగ్ : కే‌సి‌ఆర్ కి కష్ట కాలం మొదలు !

cm kcr

 ఉద్యమ పార్టీగా పుట్టిన తెరాస పార్టీ మెల్ల మెల్లగా తెలంగాణలో బలమైన పార్టీగా ఎదిగి, తెలంగాణ రాష్ట్రం సాధించటంలో కీలకపాత్ర పోషించి తెలంగాణ లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది, అయితే ఇదంతా గతం. ప్రస్తుతం తెలంగాణలో తెరాస పార్టీ భవిష్యత్తు మీద నీలినీడలు కమ్ముకుంటున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటే తనకు కష్టమని భావించి ఆ పార్టీని తెలంగాణలో పాతాళనికి తొక్కిన కేసీఆర్ కు ఆ ఆనందం లేకుండా చేస్తుంది బీజేపీ పార్టీ.

cm kcr

గతంలో తెలంగాణలో బీజేపీ పార్టీ అంటే ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ నేడు తెరాస కు సరైన పోటీ ఇవ్వగలిగిన పార్టీ ఏదయ్యా అంటే బీజేపీ అనే చెపుతున్నారు. ఇప్పటికే నాలుగు ఎంపీ సీట్లు గెలవగా ఇటీవలే దుబ్బాకలోనూ కేసీఆర్ కి పెద్ద షాక్ ఇచ్చింది..ఈ గెలుపులతో బీజేపీ కి కొత్త ఉత్సాహం వచ్చినట్లయ్యింది. ఎప్పటినుంచి తెలంగాణ లో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది.. దానికి తోడు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి ఫైర్ బ్రాండ్ నేతలు కూడా బీజేపీలో చక్రం తిప్పుతున్నారు. అదే సమయంలో కేంద్రం కూడా తెలంగాణ బీజేపీ సభ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజల్లో మార్పుకు కారణం.. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి గా చేసి ప్రజల్లో బీజేపీ పై నమ్మకం పెరిగేలా చేసింది..

 తెలంగాణలో కొంచం కష్టపడితే ఖచ్చితంగా అధికారంలోకి రాగలం అనే ధీమా బీజేపీ పార్టీలో కలిగింది. దానిని నిదర్శనమే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నిర్వహించిన ప్రచారం. జాతీయ రాజకీయాలకు చెందిన దాదాపు డజన్ మంది నేతలతో హైదరాబాద్ లో ప్రచారం చేపించి కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టించారు. ఇదే సమయంలో కేంద్రం కూడా కేసీఆర్ విషయంలో గట్టిగానే దృష్టి సారించినట్లు తెలుస్తుంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుతానని, అన్ని పార్టీలను ఏకం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చుతానని కేసీఆర్ చెప్పటంతో ఆ విషయంలో బీజేపీ కూడా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ ను ఇదే విధంగా వదిలేస్తే తమకు ముప్పు ఉందని భావించి,కేసీఆర్ ను టార్గెట్ చేసినట్లు అర్ధం అవుతుంది. ఇవన్నీ గమనిస్తే కేసీఆర్ కు కష్టకాలం వచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు