నటీనటులు : రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని, షారూఖ్ ఖాన్, డింపుల్ కపాడియా
దర్శకత్వం : అయాన్ ముఖర్జీ
నిర్మాతలు : కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మారిజ్కే డిసౌజా, అయాన్ ముఖర్జీ
సంగీత దర్శకుడు : సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్
గత కొంత కాలంగా బాలీవుడ్ లో ఎంతో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలన్నీ బాక్స్-ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ మధ్యే రణబీర్ కపూర్ నటించిన ‘శంషేరా’ సినిమా వచ్చినట్టు కూడా తెలియకుండా వెళ్ళిపోయింది. చాన్నాళ్ల నుండి షూటింగ్ లో ఉండి కొంత హైప్ మధ్య రిలీజ్ అయ్యింది ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో నాగార్జున నటించడం, రాజమౌళి ఈ సినిమాని తెలుగు లో ప్రమోట్ చెయ్యడంతో సినిమా మీద కొంత బజ్ క్రియేట్ అయ్యింది. అస్సలు ‘బ్రహ్మాస్త్ర’ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
కథ :
అన్ని అస్త్రాలకి అధిపతి అయిన బ్రహ్మాస్త్రాన్ని మూడు భాగాలుగా విభజించి దుష్టుల చేతికి చిక్కకుండా బ్రహ్మాన్ష్ గ్రూప్ కాపాడుతూ ఉంటుంది. అయితే బ్రహ్మాస్త్ర లోని ఒక భాగం బ్రహ్మాన్ష్ గ్రూప్ కు చెందిన అనీష్(నాగార్జున) దగ్గర ఉంటుంది. రెండవ భాగం సైంటిస్ట్ మోహన్ భార్గవ్ (షారుఖ్ ఖాన్) దగ్గర ఉంటుంది. అయితే మిగిలిన మూడో భాగం ఎక్కడుంది ? అని స్టోరీ లో తెలుస్తోంది. విడి విడిగా ఉన్న ఈ మూడు బాగాలన్నిటిని కలిపి, ఆ బ్రహ్మాస్త్ర ని చేజిక్కించుకోవాలని మౌనీ రాయ్, ఇంకొందరు చాలా ప్రయత్నాలు చేస్తూ.. బ్రహ్మాన్ష్ గ్రూప్ కు చెందిన వ్యక్తులను చంపేస్తూ బ్రహ్మాస్త్ర భాగాలు కోసం వెతుకుతూ ఉంటారు.
ఇదంతా డీజే శివ(రణబీర్ కపూర్)కి తన కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీనితో తనలో తానే చిత్రవధ అనుభవిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శివ, ఇషా(అలియా భట్) తో ప్రేమలో పడతాడు. చివరికి తన ప్రేమ కోసం శివ ఏం చేశాడు?, బ్రహ్మాస్త్ర ను కాపాడటానికి గురూజీ (అమితాబ్ బచ్చన్)తో కలిసి ఏం ?, అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
విసువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియా తో పాటు అమితాబ్, షారుఖ్ ఖాన్, నాగార్జున లాంటి సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. నాగార్జున, అమితాబ్, షారుఖ్, మనసుకు హత్తుకుంటుంది. వీరి పాత్రల ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి.
విసువల్ గా ఈ సినిమా టాప్ క్లాస్ గా ఉండి.
మైనస్ పాయింట్స్:
ఎంతో హైప్ తో వచ్చిన ఈ సినిమా విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా.. కథ పరంగా పూర్తిగా నిరాశ పరిచింది. సినిమా స్టార్టింగ్ లో ఇచ్చినంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ అవ్వలేదు.
సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ ఎఫెక్టివ్ గా లేవు. దర్శకుడు విజువల్స్ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టలేదు.
తీర్పు :
ఓవరాల్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా.. కంటెంట్ పరంగా ఆకట్టుకోదు. ఫాంటసీ సినిమాలు ఇష్టపడే వాళ్లకు కొంత వరకు నచ్చొచ్చు కానీ మొత్తమ్మీద ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.