Deepika Rangaraju: దీపిక రంగరాజు అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ బ్రహ్మ ముడి కావ్య అంటే మాత్రం టక్కున ఈమె అందరికీ గుర్తుకొస్తారు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ద్వారా కావ్య పాత్రలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి దీపికా రంగరాజు. ఈమె తెలుగులో నటించింది ఒక్క బ్రహ్మ ముడి సీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్ ద్వారా గుర్తింపు పొందడంతో పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు ఇతర షోలతో ఎంతో బిజీగా ఉన్నా కావ్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినవారు ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే చాలామంది మనం అలాంటి వాళ్ళం కాకపోయినప్పటికీ అలాంటి వాళ్ళమే అని అనుకుంటారు. అలాంటి పనులు చేసే ఈ స్థాయికి వచ్చామని కూడా నమ్మేస్తుంటారు.చదువుకున్న వాళ్ళు కూడా అలానే భావిస్తారు. నాకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.
బుల్లితెర 100 శాతం ఫ్యూర్ ఘీ వంటిది. సినిమా పరిశ్రమ కూడా మంచిదే. కానీ కొందరు వేస్ట్ పీపుల్ అలాంటి పనులు చేస్తారు. నిజంగా సినిమాలు చేసే వాళ్ళు క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడరు. కొందరు సినిమా పేరుతో క్యాస్టింగ్ కౌచ్ చేస్తారు. నాకు అలాంటి వారు ఎదురైనప్పుడు నేను వార్నింగ్ ఇవ్వను. జస్ట్ అవైడ్ చేస్తాను… అంటూ చెప్పుకొచ్చింది. ఇలా క్యాస్టింగ్ కౌచ్ గురించి దీపిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా ఈమె మాట్లాడారు తనకైతే ఇప్పటివరకు ఛాన్స్ రాలేదని ఒకవేళ అవకాశము వచ్చి బిగ్ బాస్ లోకి వెళ్తే కప్పు అందుకొనే బయటకు వస్తాను అంటు ధీమా వ్యక్తం చేశారు.
