Deepika: ప్లీజ్ నన్ను బిగ్ బాస్ షో కి పిలవండి.. రిక్వెస్ట్ చేసిన బ్రహ్మముడి సీరియల్ నటి.. కల నెరవేరుతుందా?

Deepika Rangaraju: బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షో లలో ఒకటైన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతోపాటు ఇంకా ఎన్నో భాషల్లో ప్రసారం అవుతూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఇప్పటికే హిందీలో 15 కు పైగా సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగులో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా త్వరలోనే తొమ్మిదవ సీజన్ కూడా మొదలుకానుంది. ఇప్పటికే ప్రోమో ని కూడా విడుదల చేస్తూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇది ఇలా ఉంటే మామూలుగా బిగ్ బాస్ హౌస్ లోకి చాలామంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.

అందులో సీరియల్స్ లో నటించే నటీనటులు కూడా ఒకరు. కొంతమంది బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి మరింత ఫేమ్ సంపాదించుకోవాలి అనుకుంటే మరి కొందరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకపోవడమే మంచిదని అనుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా బయట జనాల్లో ఫేమ్ ఉన్నవాళ్ళని కొంతమందిని తెస్తారు. కానీ ఈ నటిని పిలవట్లేదట. తనను బిగ్ బాస్ హౌస్ లోకి పిలవండి అంటూ సదరు నటి షో నిర్వాహకులకు రిక్వెస్ట్ చేస్తోంది. ఆమె మరెవరో కాదు బ్రహ్మముడి సీరియల్ తో తెలుగులో భారీగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ బ్యూటీ దీపిక రంగరాజు.

చాలామంది దీపికా అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ బ్రహ్మముడి సీరియల్ కావ్య అంటే చాలు ఇదే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. సీరియల్ లో చాలా పద్ధతిగా నటించే కావ్య బయట మాత్రం అల్లరి కామెడీ టైమింగ్స్ వేరే లెవల్ అని చెప్పాలి. ఇప్పటికే స్టార్ మా షోతో పాటు చాలా రకాల షోలకు హాజరైన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపీకా బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా దీపికా రంగరాజు బిగ్ బాస్ ఛాన్స్ గురించి మాట్లాడుతూ.. చాలా మంది నన్ను అడుగుతున్నారు బిగ్ బాస్ కి వెళ్తారా అని. ప్రస్తుతం అయితే బ్రహ్మముడి సీరియల్ ఉంది కాబట్టి వెళ్ళను. ఆ సీరియల్ అయ్యాకే వెళ్తాను. నాకు ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి కాల్ రాలేదు, వస్తే కచ్చితంగా వెళ్తాను. నాకు అయితే బిగ్ బాస్ చాలా ఇంట్రెస్ట్, వెళ్లాలని కూడా ఉంది. నన్ను పిలవాలి అని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ కి వెళ్తే విన్నర్ టైటిల్ గెలవాలి. నాగార్జున గారు నా చేతిని పైకెత్తి విన్నర్ అని చెప్పాలి అని తెలిపింది. ఈ సందర్భంగా దీపికా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.