Deepika Rangaraju: కార్తీకదీపం సీరియల్ అవకాశం నాకే వచ్చింది.. కానీ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్!

Deepika Rangaraju: దీపికా రంగరాజు… చాలామంది ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టకపోవచ్చు కానీ బ్రహ్మముడి సీరియల్ కావ్య అంటే చాలు ఇదే గుర్తుపట్టేస్తారు. ఈ ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా అభిమానులను సంపాదించుకుంది కావ్య. ఈ సీరియల్ లో గొప్పింటి కోడలు అయినా కూడా ఎంతో పద్ధతిగా ఉంటూ, ఇంటి ఇల్లాలిగా అన్ని పనులు చక్కపెడుతూ ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దీపికా బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తూనే మరొకవైపు పలు టీవీ షో లతో ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్తీక దీపం ఛాన్స్ మొదట నాకే వచ్చింది. కానీ నాకు అప్పటికి అంత ఏజ్, అంత మెచ్యూరిటీ లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడు అది కార్తీక దీపం సీరియల్ అని తెలీదు. బ్లాక్ మేకప్ వేసుకొని నటించాలి అన్నారు. ఒక మలయాళం సీరియల్ రీమేక్ అని చెప్పారు. ఇదంతా ఫోన్ లోనే జరిగింది. ఆడిషన్ కి రమ్మన్నారు. కానీ పేరెంట్స్ ఒక్కదాన్నే హైదరాబాద్ కి వద్దని అన్నారు. దేవుడి దగ్గర చిట్టీలు వేసాను హైదరాబాద్ కి వెళ్లాలా వద్దా అని వద్దు అని వచ్చింది.

దాంతో వెళ్ళలేదు. సీరియల్ కి నో చెప్పాను అని తెలిపింది దీపికా. ఈ సందర్భంగా దీపికా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీపికా రంగరాజు కామెడీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ మా షోలో ఎక్కువగా పాల్గొంటూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా ఈమె కార్తీకదీపం సీరియల్ గురించి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం కార్తీకదీపం 2, బ్రహ్మముడి సీరియల్ ఇవి రెండూ కూడా టిఆర్పి రేటింగ్ విషయంలో ఒకదానితో ఒకటి పోటీగా నిలుస్తున్నాయి.