Bigg Boss Nikhil: తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటుడు నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై చాలా సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. అయితే నిఖిల్ కన్నడ నటుడే అయినప్పటికీ తెలుగులో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక సీరియల్స్ లో నటిస్తూనే బుల్లితెర నటి కావ్యని ప్రేమించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని వారు అధికారికంగా కూడా ప్రకటించారు. ఇంస్టాగ్రామ్ లో ఎన్నో రకాల రీల్స్ కూడా చేశారు. అంతేకాకుండా స్టేజ్ పై ఒకరికొకరు ప్రపోజ్ లు కూడా చేసుకున్నారు. కొన్ని షోలలో ఇద్దరు జోడిగా కూడా పాల్గొన్నారు. అలా ఇద్దరు చిలకా గోరింకల్లా ఉండేవారు. కానీ బిగ్ బాస్ షో వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టిందని చెప్పాలి.
ఇటీవల తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షోలో పాల్గొన్న నిఖిల్ సీజన్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో చాలా సందర్భాలలో కావ్య అని ప్రేమిస్తున్నట్టు ఇండైరెక్టుగా చెప్పుకొచ్చారు నిఖిల్. ఆ తర్వాత డైరెక్ట్ గా కావ్య పేరు చెప్పడంతో పాటు తనను ప్రేమిస్తున్నానని తననే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోకపోతే ఎవరు వచ్చినా లేపుకొని పోతాను అంటూ ఛాలెంజ్ కూడా చేశాడు. బిగ్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత నేరుగా కావ్యని కలుస్తాను అని చెప్పాడు. తీరా బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత మాట మార్చేశాడు నిఖిల్. బిగ్బాస్ షో ముగిసి ఇన్ని రోజులు అవుతున్నా కూడా కావ్యని ఇంకా కలవలేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. అందుకు గల కారణం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్, సోనియా, యష్మీ లతో ప్రేమాయణం నడపడమే. మొదట సోనియాతో హగ్గులు లవ్వు అంటూ రెచ్చిపోయిన నిఖిల్ ఆ తర్వాత యష్మీ మీద కన్నేసాడు.
అలా ఈ విషయంలో కొంచెం నెగిటివిటిని కూడా తెచ్చుకున్నాడు నిఖిల్. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టార్ మా విత్ పరివారం లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో లోకి బిగ్ బాస్ టైటిల్ తో ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. సీరియల్ టీం అంటూ ఒక కావ్య కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రోమోలో శ్రీముఖి మాట్లాడుతూ.. అవతల సీరియల్ పరివారం ఉన్నారు ఇంటర్వ్యూస్ చేసుకుందాం అంటూ అక్కడికి వెళ్ళింది. మొదట గుండె నిండా గుడిగంటలు హీరో బాలుని పరిచయం చేసిన ఆమె కావ్యను పరిచయం చేయకుండా దాటేసి వెళ్లిపోయింది. తర్వాత ప్రియాంక, ఆమె ప్రియుడు శివ్, తర్వాత మానస్ ని పరిచయం చేసిన శ్రీముఖి పక్కనే ఉన్న కావ్య వైపు చూడకుండా వెళ్ళిపోయింది. నిఖిల్ కూడా ఆమె వైపు చూడకుండా వెళ్ళిపోయాడు. వెనకాల లవ్ సాంగ్ వచ్చినప్పటికీ కావ్యం మాత్రం ఫేస్ని చాలా సీరియస్గా పెట్టింది. నిఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కావ్య ఫేస్ లో నవ్వు లేదు ఫుల్ సీరియస్ గా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని ఇద్దరు విడిపోయినట్టే అర్థమవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలోనే విడుదల కానుంది. ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిఖిల్ కావ్య విడిపోయారా ఎందుకు కావ్య ముఖం అంత సీరియస్ గా పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.