బిజీగా ఉన్న హీరోల్లో రవితేజ కూడ ఒకరు. ఈయనతో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తారు అనేది ఇంకా తేలలేదు. మారుతి, బోయపాటి శ్రీను ఇద్దరూ రవితేజ కోసం కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. మారుతి ఏమో ‘పక్కా కమర్షియల్’తో పాటు సంతోష్ శోభన్ సినిమాలు ఫినిష్ చేసి రవితేజతో వర్క్ చేయాలని అనుకుంటున్నారు. బోయపాటి శ్రీను కూడ ‘అఖండ’ తర్వాత రవితేజతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు.
ఇద్దరూ రవితేజ డేట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. కానీ రవితేజ మాత్రం ఎవ్వరికీ మాట ఇవ్వట్లేదు. ఇద్దరూ మంచి దర్శకులే కావడంతో నిర్ణయం తీసుకోలేక వారిలో వారినే తేల్చుకోమన్నట్టు వదిలేశారట. అదెలాగంటే ఇద్దరిలో ఎవరు సాలిడ్ హిట్ అందుకుని తన వద్దకు వస్తారో వారికే సినిమా ఇవ్వాలనేది రవితేజ ఆలోచనట. ‘అఖండ’తో హిట్ అందుకుని బోయపాటి బౌన్స్ బ్యాక్ అయితే ఆయనకే డేట్స్ ఇస్తారు. ఒకవేళ మారుతి గనుక హిట్ పట్టుకుని వస్తే అతనితో సినిమా చేస్తాడు. ఇలా ఇద్దరికీ మీలో మీరే తేల్చుకోండి అన్నట్టు వదిలేశారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు రవితేజ మెప్పిస్తారో చూడాలి.