బాక్సాఫీస్ : తెలుగులో కన్నడ సెన్సేషన్ “కాంతారా” డే 1 షాకింగ్ వసూళ్లు.!

గత వారం రోజులు నుంచి కూడా తెలుగు సహా పాన్ ఇండియా మార్కెట్ లో కూడా బాగా వినిపిస్తున్న సినిమా పేరు “కాంతారా”. కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా లెవెల్లో బాగా రైజ్ అవుతున్న క్రమంలో ఈ చిత్రం వచ్చి సైలెంట్ గా ఒక సెన్సేషన్ లా మారింది.

కన్నడ లో అయితే ఏకంగా 100 కోట్ల గ్రాస్ ని సింపుల్ గా అందుకోగా తెలుగులో కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మరి తెలుగులో అయితే షాకింగ్ వసూళ్లు మొదటి రోజు వచ్చినట్టుగా తెలుస్తుంది. సినిమాకి ముందే భారీ పాజిటివ్ టాక్ ఉండడంతో అసలు హీరో ఎవరో కూడా తెలియకపోయినా మనవాళ్ళు ఏకంగా డే 1 లోనే 5 కోట్ల గ్రాస్ ని అందుకుందట.

పైగా ఒక్క నైజాం ఏరియా లోనే మొదటి రోజు 1 కోటికి పైగా గ్రాస్ ని వసూలు చేయడం అయితే ట్రేడ్ సర్కిల్స్ కి షాక్ లా మారింది. రీసెంట్ గా వచ్చిన డబ్బింగ్ చిత్రాల్లో ఇది నిజంగా చాలా బెటర్ నెంబర్ పైగా ఈ రిషబ్ శెట్టి అనే నటుడికి తెలుగులో కూడా ఇదే మొదటి సినిమా అయినా..

ఈ రేంజ్ లో వసూళ్లు అంటే క్రేజీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే హీరో రిషబ్ శెట్టి నే దర్శకత్వం వహించగా ఈ ఏడాది ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ “కేజీఎఫ్” నిర్మాణ సంస్థ హోంబేలె ఫిలింస్ వారు నిర్మాణం వహించారు.