Mike Tyson: ఫ్లైట్ లో ఓ ప్రయాణికుడి ముఖం పగలగొట్టిన బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్..

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అనే పేరు వినే ఉంటారు. అంతేకాకుండా ఈయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఇతడు విమానంలో ప్రయాణిస్తూ ఉండగా.. తన తోటి ప్రయాణికుడి ముఖం పగలగొట్టాడు.

ఇంతకు అసలేం జరిగిందంటే.. ఆయన ఫ్రెండ్స్ ఉన్న సమయంలో ఆయన తోటి ప్రయాణికుడు.. ఆయనను చూసి సంతోషంలో అతడి ఫోటోను తీశారు. అంతేకాకుండా ఓ వీడియోను కూడా తీస్తుండగా.. అందులో మైక్ సీట్ వెనకాల నిలబడి మైక్ మైక్ అని అరవడంతో ఆయన నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడు. అయినా కూడా అతని వినకుండా అలా చేయటంతో దీంతో కోపం వచ్చినా మైక్ అతని తలపై పిడుగుద్దుల్లు కురిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.