Box Office Report : బాక్సాఫీస్ రిపోర్ట్ : అక్కడ డిజాస్టర్ దిశగా “బంగార్రాజు”? డే 6 దారుణ వసూళ్లు!

Box Office Report : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో ఏవేవో సినిమాలు వస్తాయి అనుకుంటే నిజంగానే ఏవేవో సినిమాలు వచ్చాయి. ఆల్ మోస్ట్ అన్ని భారీ సినిమాలు విడుదల ఆగిపోగా ఈ స్థానాలను చిన్న సినిమాలు సహా ఒక ప్రముఖ సినిమా తీసుకున్నాయి. ఆ ప్రముఖ సినిమానే అక్కినేని నాగార్జున నటించిన “బంగార్రాజు” ఒకటి.

అయితే ఇది నాగ్ సినిమా అనే కాకుండా కొడుకు నాగ చైతన్య కూడా నటించడంతో ఈ సినిమా మల్టీ స్టారర్ అయ్యింది. ముందే భారీ బిజినెస్ ని ఈ సినిమా జరుపుకుందని చెప్పాము.. అందుకు తగ్గట్టే భారీ ఓపెనింగ్స్ కూడా ఈ సినిమా అందుకోవడంతో బంగార్రాజు ఖచ్చితంగా గట్టెక్కేస్తుంది అనుకున్నారు కానీ నైజాం లో ఈ చిత్రం పరిస్థితి దారుణంగా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాకి గాను అక్కడ 11 కోట్ల బిజినెస్ జరగగా ఆరవ రోజు షాకింగ్ వసూళ్లు ఈ సినిమా అందుకుందట. ఈ ఆరవ రోజు ఈ చిత్రం ఆరుకి తగ్గట్టు గానే 6 లక్షల షేర్ మాత్రమే అందుకుందట. దీనితో అక్కడ ఈ చిత్రం 5.9 కోట్ల షేర్ ని అందుకుందట. అంటే రేపటికి అలా 6 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నా ఈ దారుణమైన డ్రాప్ తో 11 కోట్లు అందుకోవడం అంటే కష్టమే అని చెప్పాలి.

దీనితో అక్కడ మాత్రం బంగార్రాజు డిజాస్టర్ గా నిలిచిపోవడం ఖాయం అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా దక్ష నగార్కర్ ఫరియా అబ్దుల్లాలు స్పెషల్ సాంగ్స్ చేశారు. అలాగే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాని నిర్మాణం వహించారు.