జగన్ హామీలు నెరవేరుస్తారా? అన్న అనుమానం ఉండేది.. బొత్స సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు పదవులను ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్.. తన ఆలోచనలకు అనుగుణంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.

Botsa Satyanarayana Speaks About Bc Posts Given By Jagan
botsa satyanarayana speaks about bc posts given by jagan

రాష్ట్రం మొత్తం 728 మంది బీసీలకు కార్పొరేషన్ల ద్వారా బీసీలకు సేవ చేసేందుకు సీఎం జగన్ ఎంపిక చేశారని మంత్రి బొత్స అన్నారు. అయితే.. బీసీల గర్జన సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఆ హామీలను నెరవేర్చుతారా? అన్న అనుమానం ఉండేది. కానీ.. అధికారంలోకి వచ్చాక… ముఖ్యమంత్రి ఆలోచనా విధానం తెలుసుకొని మేమే ఆశ్చర్యపోయాం. బీసీలంటే ఓట్ల కోసం కాదు… చేతి వృత్తులకే పరిమితం కాదు.. వాళ్లు సమాజానికి వెన్నుముక అని జగన్ చెప్పారని మంత్రి గుర్తు చేశారు.

చెప్పింది చేస్తాం… మాట తప్పం.. మడమ తిప్పం.. అని సీఎం జగన్ మరోసారి నిరూపించారని మంత్రి గుర్తు చేశారు. బలహీన వర్గాలకు సీఎం ఇచ్చే ప్రాధాన్యతకు మేమే సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నాం.. అని మంత్రి అన్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles