AP: పదవులన్నీ తమ కుటుంబాలకే…తరువాతే పని చేసిన వారికి…. కుటుంబ రాజకీయాలు కొనసాగుతున్నాయా?

AP: సాధారణంగా ప్రతి ఒక్కరంగంలో కూడా వారసత్వం అనేది కొనసాగుతుంది అయితే రాజకీయాలలో కూడా ఈ వారసత్వాలు అనే కొనసాగుతున్నాయని కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఒక నాయకుడిని నమ్మి కొన్ని కోట్ల కుటుంబాలు ఓట్లు వేసి వారికి గెలిపిస్తే నాయకులు మాత్రం ముందు ప్రజలు కాదు తమ కుటుంబం అంటూ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబంలో ఉన్న వారందరికీ పదవులు పూర్తి అయిన తర్వాత పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పదవులు కట్టబెడుతున్నారు.

ఏపీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనపడుతుంది చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ పరంగా ఏదో ఒక పదవిలో ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగా ఇప్పుడు తన అన్నయ్య నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి అనంతరం మంత్రి పదవి కట్టబెట్టబోతున్నారు. ఇలా కూటమి పార్టీలో నాయకులందరూ కూడా వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు ఇస్తున్నారు.

ఇలా కుటుంబంలో ఉన్నవారు పూర్తి అయిన తరువాతనే పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ నమ్మకంగా ఉన్నవారికి పదవులు వస్తున్నాయి అంటూ కూటమినేతల తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. పైగా ఇది కుటుంబ వారసత్వ రాజకీయాలు కాదని, పార్టీ కోసం కష్టపడుతున్న వారికే పదవులు ఇస్తున్నామంటూ బయటకు చెబుతున్నారు.మొన్నటి ఎన్నికల్లో ఐదు టిక్కెట్లు ఆ కుటుంబానికే దక్కాయి. చంద్రబాబు, లోకేశ్, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంద్రీశ్వరి, శ్రీభరత్ లు టిక్కెట్లు పొంది చట్టసభలకు ఎన్నికయ్యారు.

విపక్ష నేత వైసీపీ అధినేతజగన్ కూడా అదే తరహా రాజకీయాల నుంచి వచ్చారు. తండ్రి వైఎస్ వారసత్వరాజకీయాలను అందుకుని సొంత పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ పనిచేస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు జగన్ బంధువులు అనేక మంది టిక్కెట్లు పొంది వివిధ పదవులలో ఉన్నారు. ఇప్పుడు జనసేనలో కూడా ఇదే తరహా రాజకీయాలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది.