కరోనా లాక్ డౌన్ సినిమా రంగాన్ని కుదిపేసింది. ఒకవైపు షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ కార్మికులు కష్టాలు పడుతున్నారు. సినిమాల విడుదలలు లేకపోవడంతో థియేటర్ రంగం కూడ కుదేలయింది. సినిమా హాళ్లలో పనిచేస్తున్న అనేక మంది ఉపాధిని కోల్పోయారు.
ఈ లేక డౌన్ ఎఫెక్ట్ టికెట్ విక్రయ యాప్ బుక్ మై షో మీద కూడ బలంగా పడింది. బుక్ మై షో ఏడాదిన్నర క్రితం వరకు భారీ లాభాల్లో నడిచిన సంస్థ. దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో బుక్ మై షోకు భారీ సంఖ్యలో వినియోగదారలు ఉండేవారు. రోజు లక్షల సంఖ్యలో థియేటర్ టికెట్లు అమ్ముడయ్యేవి. దీంతో యాప్ యాజమాన్యం అత్యధిక లాభాల్ని గడిచింది.
కానీ ఏడాదిన్నరగా సినిమా హాళ్లు మూతబడిపోవడంతో బుక్ మై షో బిజినెస్ ఒక్కసారిగా కుదేలయింది. కనీసం ఈవెంట్స్ కూడ లేకపోవడంతో యాప్ వాడకం భారీగా తగ్గిపోయింది.దీంతో లాభాలు పడిలోవడమే కాకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడ కష్టంగా మారింది. అయినా సగం జీతాలతో ఇన్నాళ్లు ఉద్యోగులను మెయింటైన్ చేస్తూ వచ్చిన యాజమాన్యం మెల్లగా చేతులు ఎత్తేసింది.
తాజాగా సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించి భారం తగ్గించుకుంది. త్వరలో సినిమా హాళ్లు తెరుచుకుంటేనే మళ్లీ సంస్థ కొలుకుంటుంది. లేకుంటే మిగిలిన ఉద్యోగులకు కూడ ఉద్వాసన తప్పేలా లేదు.