Allu Arjun మరో థియేటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన బన్నీ… ఎక్కడ… స్పెషల్ ఏంటంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఈయన నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరిగిపోయిందని చెప్పాలి.

ఇకపోతే అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటూ భారీగానే సంపాదిస్తున్నారు అయితే ఇలా సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఈయన పెట్టుబడి రూపంలో పెడుతూ మరిన్ని ఆస్తులను సంపాదిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి హైదరాబాదులో థియేటర్ తో పాటు స్టూడియోస్ కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా మరొక స్టూడియో నిర్మాణానికి ఈయన శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.హైదరాబాద్ లోని కోకాపేట్ ఏరియాలో అల్లు స్టూడియోస్ పేరుతో కొత్త సినిమా థియేటర్ ని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ భూమి పూజ కార్యక్రమాలు కూడా పూర్తయి నిర్మాణ పనులు మొదలైనట్లు సమాచారం. ఈ భూమి పూజ కార్యక్రమంలో అల్లు బాబీ, శిరీష్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ థియేటర్ లో 4కే స్క్రీన్ తోపాటు డాల్బీ సౌండ్ సిస్టం ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు హైదరాబాదులో ఈ విధమైనటువంటి డాల్బీ సౌండ్ సిస్టం కలిగిన థియేటర్లో ఒకటి కూడా లేవు కానీ మొదటిసారి అల్లు అర్జున్ ఈ విధమైనటువంటి సౌండ్ సిస్టంతో ఉన్న థియేటర్ ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో అల్లు అర్జున్ కొత్త సినిమా థియేటర్ పై ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ అమీర్ పేట్ లో ఏషియన్ సత్యం మాల్ లో భాగస్వామిగా ఉన్నాడు.

ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన అట్లి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్లో బిజీ కానున్నారు. ఈ సినిమాలు పూర్తయిన అనంతరం పుష్ప 3 పనులలో బిజీ కాబోతున్నారు.