‘లియో’కు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రూపంలోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు!?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘లియో’. త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా.. ‘లియో’ కోసం విజయ్‌ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌తో పాటు, టీజర్‌, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై తిరుగులేని హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ను ప్రకటించింది. లియో సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ నేటి నుంచి బుక్‌ మై షోలో స్టార్ట్‌ అయ్యినట్లు చిత్రబృందం వెల్లడించింది. అక్టోబర్‌ 19న సినిమా విడుదల కానుండగా.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రూపంలోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది.