AP: ఐదేళ్లలో వైసీపీ ఏం పీకింది… సూటిగా ప్రశ్నించిన లోకేష్… దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన వైసీపీ?

AP: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా తరచూ గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వ గురించి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు ఏం చేశారు? ఐదేళ్లలో వైసిపి ఏం పీకింది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్సీపీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేస్తున్న మీ బాబు ఏం పీకాడో ముందు గుర్తుచేసుకో. మాటలు మాట్లాడే ముందు కాస్త జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో అంటూ మండిపడింది.విశాఖకు రైల్వే జోన్ వద్దు, విజయవాడకు ఇవ్వండి అంటూ అప్పటి ఎంపీలు రాయపాటి, గల్లా జయదేవ్ లతో కేంద్రానికి లేఖలు రాయించింది మీ బాబు అని నీకు తెలియదా ఒకవేళ తెలియకపోతే ఇంటికెళ్లి అడుగు అంటూ గట్టిగా సమాధానం చెప్పారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఉత్తరాంధ్రకు జగన్ చేసిన మంచి ఏంటో చెబుతాం విను అంటూ..

*భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో కేవలం ఆరుపోర్టులు మాత్రమే ఉన్నాయి.జగన్ సీఎం అయ్యాక మరో నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టి.. వాటి కోసం వేల కోట్లు ఖర్చు చేశారు.

*టెక్కలి నియోజకవర్గం మూలపేట తీరంలో పోర్టు నిర్మాణానికి, ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్ ఎత్తిపోతల పథకానికి వైసీపీ హయాంలో శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించారు.

*కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, విజయనగరం, పార్వతీపురం, నర్సీపట్నంలలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టారు.

*ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఎవరూ చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి చేశారు ఎన్నో ప్రభుత్వాలు మారిన అక్కడ ప్రజల సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించ లేకపోయారు కానీ జగన్ మాత్రం వారికి స్వచ్ఛమైన తాగునీరును అందించడమే కాకుండా కిడ్నీ రీసర్చ్ సెంటర్ కూడా ప్రారంభించారు.
*సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీని కూడా నిర్మించారు ఇలా చెప్పుకుంటూ పోతే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తూనే ఎంతో అభివృద్ధి చేశారు.

ఇక మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పీకింది ఏంటో చెప్పాలని కూడా ప్రశ్నించారు. తల్లికి వందనం ఎగ్గొట్టారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి లేదు ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయల డబ్బులు లేవు, ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేకపోయారు. ప్రతి ఏడాది జనవరి ఒకటవ తేదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు జనవరి 1 న జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా వీటన్నిటికీ లోకేష్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.