కేజిఎఫ్ సినిమాని మిస్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు సృష్టించినదో మనకు తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇకపోతే ఈ సినిమా విజయంతో సినీ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తొంగి చూసింది. లేకపోతే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన కేజిఎఫ్2 రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించి సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కథ రాసే సమయంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను మనసులో పెట్టుకుని ఈ సినిమా కథ రాశారట.ఇకపోతే ఈ సినిమా కథ తనతో తీయాలని కథ తనకు వివరించాలని ప్రశాంత్ నీల్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ హృతిక్ రోషన్ చుట్టూ ఉన్నవాళ్లు ఒక్కసారి కూడా ప్రశాంత్ నీల్ ను హృతిక్ రోషన్ ను కలిసే అవకాశం కల్పించలేదు.

ఈ విధంగా ప్రశాంత్ నీల్ కి హృతిక్ రోషన్ అపాయింట్మెంట్ దొరక పోయేసరికి ఈయన ఆవేశంతో ఎలాగైనా ఈ సినిమా కన్నడ హీరోతో చేసి హిట్ కొట్టాలని భావించారట. అలా కన్నడ హీరోతో ఈ సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయంతో భారతీయ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆయన వైపు చూడటమే కాకుండా ఆయనతో సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా కేజిఎఫ్ చిత్రం ద్వారా ప్రశాంత్ నీల్ పేరు ప్రపంచ దేశాలలో మార్మోగిపోతోంది.