Accident: ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వాహనాలు వాడే వారి సంఖ్య ఎక్కువ అవ్వటం వల్ల రోడ్లు ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉంటున్నాయి. వాహనాలు నడిపేవారు అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా ప్రతిరోజు అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా ఇలాంటి విషాద సంఘటన చోటుచేసుకుంది. బొలెరో వెనుకనుండి లారీ నీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురు రైతులు తీవ్ర గాయాలపాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులు బసంత్‌నగర్ సమీపంలో తమ కంపెనీకి సంబంధించిన లారీ రిపేర్ కి వచ్చిందని తెలిసి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత లారీ దగ్గరకు చేరుకోవటానికి బొలెరో బయలుదేరారు. కొద్దిసేపటి లో లారీ దగ్గరికి చేరుకుంటాం అనుకున్న సందర్భంలో ఘోరం జరిగిపోయింది.
ఎన్టీపీసీ మేడిపల్లి కూడలి దగ్గరికి రాగానే ప్రధాన రహదారిపై రామగుండం వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేసి ఆపటంతో లారీ వెనుక వస్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా లారీ నీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలోమోదీనగర్‌కు చెందిన సూపర్‌వైజర్ రవీందర్‌సింగ్(55) బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కంపెనీలో పనిచేసే డ్రైవర్ జస్వీందర్‌తోపాటు కౌశల్, విష్ణులకు తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్‌రాజ్, సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను చికిత్సకోసం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తీవ్రగాయాలైన ముగ్గురిని కరీంనగర్‌కు తరలించారు. వారు పనిచేస్తున్న కంపెనీ మేనేజర్ అతుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.