బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రోజురోజుకూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే మణికర్ణిక ఆఫీసును బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు రైడ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆమె ముంబైపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొన్నిరోజులకే మణికర్ణిక ఆఫీసులో అధికారులు దాడులు చేశారు. తాజాగా మణికర్ణిక ఆఫీసును కూల్చేయాలంటూ బీఎంసీ నోటీసులు పంపించింది.
అక్రమంగా మణికర్ణిక ఆఫీసును నిర్మించారని.. అందుకే ఆ ఆఫీసును కూల్చేయబోతున్నట్టు బీఎంసీ ప్రకటించింది.
ముంబై నగరం పీవోకేలా ఉంది.. అంటూ కంగనా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే కంగనాకు డ్రగ్స్ వాడే అలవాటు ఉంది.. అంటూ కూడా కంగనాపై ఆరోపణలు వచ్చాయి.
ఆ విషయాన్ని మహారాష్ట్ర హోంమంత్రే వెల్లడించడంతో ఆ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత కంగన, శివసేన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది.
ఇప్పుడు బీఎంసీ కూడా రంగంలోకి దిగి.. అక్రమంగా నిర్మించారంటూ మణికర్ణిక ఆఫీసును కూల్చేయాలంటూ నోటీసులు జారీ చేసింది.
బీఎంసీ ఆదేశాలతో వెంటనే అధికారులు మణికర్ణిక ఆఫీసుకు చేరుకొని కూల్చివేత పనులను ప్రారంభించారు.
అయితే.. బీఎంసీ అధికారులు తన ఆఫీసుపై దాడి చేశారని.. బీఎంసీ అనుమతి తీసుకున్న తర్వాతనే ఆఫీసును నిర్మించామని.. కావాలని.. తన ఆస్తిని కూల్చేస్తున్నారంటూ కంగనా ఆరోపణలు చేసింది.
I am never wrong and my enemies prove again and again this is why my Mumbai is POK now #deathofdemocracy 🙂 pic.twitter.com/bWHyEtz7Qy
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) September 9, 2020
Pakistan…. #deathofdemocracy pic.twitter.com/4m2TyTcg95
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) September 9, 2020