కంగనా రనౌత్ హృతిక్ రోషన్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది.. చివరకు అది బ్రేకప్‌తో ముగిసింది. కానీ ఈ ఇద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ మాత్రం ముగియడంలేదు. కంగనాను ఇరుకున పెట్టాలని చేస్తున్నారో లేదో తెలియడం లేదు గానీ ప్రతీసారి హృతిక్ రోషన్ పేరుతో కంగనాకు కేసుల వల వేద్దామని చూస్తుంటారు. క్రిష్ 3 సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం చిగురించింది.
ఆ మధ్య కంగనా రనౌత్.. బాలీవుడ్, సుశాంత్ సింగ్, డ్రగ్స్ కేసుల గురించి ఫైర్ అవుతున్న తరుణంలోనూ హృతిక్ రోషన్ వ్యవహారం బయటకు వచ్చింది. నాటి బ్రేకప్, వివాదాలు అన్ని కూడా తెరపైకి వచ్చాయి. మళ్లీ తాజాగా కంగనాపై పాత కేసులు తోడేందుకు రంగం సిద్దమైంది. 2013, 2014 సమయంలో కంగనా మెయిల్ నుంచి వందల సంఖ్యలో మెయిళ్లు వచ్చాయని, తన కుటుంబంపై ఇది తీవ్ర ప్రభావం చూపిందని 2016లో హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఆ కేసును మళ్లీ ఇప్పుడు తోడుతున్నారు. ఈ విషయంపై కంగనా స్పందిస్తూ.. అతడి ఏడుపుగొట్టు కథ మళ్లీ మొదలైంది. మాకు బ్రేకప్ అయ్యి, అతను విడాకులు తీసుకుని చాలా ఏళ్లు అవుతోంది. అయినా ముందుకు సాగేందుకు తను ఇంకా ఇష్టపడటం లేదు. వేరే మహిళతో డేటింగ్ చేయడానికి ఇష్టపడటం లేదు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకులు అధిగమించి నేను ధైర్యంగా ముందుకు వెళ్తుంటే అతడు మళ్లీ డ్రామా మొదలుపెట్టాడు. ఈ చిన్నపాటి అఫైర్ గురించి ఇంకెన్నాళ్లు ఏడుస్తావ్ అంటూ ఫైర్ అయింది.