ప్రస్తుత కాలం చిన్న పిల్లలు పెద్దవారు అని తేడా లేకుండా చాలామంది కంటిచూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం, తరచూ టీవీ, ఫోన్, లాప్టాప్ చూస్తూ గడపటం ద్వారా ఈ రోజుల్లో కంటి చూపు సమస్యలు తలెత్తుతున్నాయి. మన శరీరంలో కొన్ని విటమిన్స్ లోపించటం వల్ల కూడా ఈ కంటి చూపు సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్య నుండి బయటపడటానికి మొబైల్, టీవీ, లాప్టాప్ వంటి వాటిని తక్కువగా వినియోగించాలి. అంతే కాకుండా పోషకాలు మెండుగా ఉండే ఆహారపదార్థలు తీసుకోవాలి. కంటి చూపును మెరుగుపరిచే పోషక పదార్థాలు పండ్లు , కూరగాయలలో పుష్కలంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడటానికి తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కంటి చూపు మెరుగుపరచడంలో పీచు ఎక్కువగా పండ్లు బాగా ఉపయోగపడతాయి. పీచు పదార్థాలలో బీటాకెరటిన్ అధికంగా ఉంటుంది. అందువల్ల పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడంతో కంటి చూపు మెరుగు పడుతుంది. అవకాడో పండు కూడా కంటి చూపు సమస్యలను దూరం చేయటానికి ఉపయోగపడుతుంది. అవకాడోలో బీటాకెరటిన్, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఇ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తరచూ తినడం మంచిది.
కంటి చూపు మెరుగుపరచడంలో క్యారెట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు క్యారెట్ తినడం వల్ల కట్టి చూపు సమస్యలను దూరం చేసి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక బచ్చలి కూర, పాల కూర వంటి ఆకు కూరలు కూడా కంటి చూపు మెరుగు పరిచేందుకు ఉపయోగపడతాయి. ఈ ఆకుకూరలలో విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ ఈ ఆకుకూరలతో వంటలు తయారు చేసుకొని తినటం లేదా ఈ ఆకులను మెత్తగా పేస్ట్ చేసి ఆ రసాన్ని తాగటం వల్ల కూడా కంటి చూపు మెరుగు పడుతుంది.