YSRCP : వైసీపీలో చేరనున్న ఆ ‘కమలం’ నేత ఎవరు.?

YSRCP

YSRCP : ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయనే మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ. వైఎస్సార్సీపీలో చేరాల్సిన కన్నా లక్ష్మినారాయణ చివరి నిమషంలో బీజేపీ వైపుకు వెళ్ళారు. లేదంటే, బొత్స సత్యనారాయణ లాగానో, ఇంకొకరిలాగానో మంత్రి పదవి దక్కించుకునేవారే వైసీపీ ప్రభుత్వం.

ఇంతకీ, ఇప్పుడీ కన్నా లక్ష్మినారాయణ గురించిన చర్చ ఎందుకు.? అంటే, దానికీ బలమైన కారణముంది. ఆయన అతి త్వరలో వైసీపీలో (YSRCP) చేరబోతున్నారంటూ ఓ గాసిప్ పుట్టుకొచ్చింది. నిప్పు లేకుండా రాజకీయాల్లో పొగ వచ్చేస్తుంటుంది. అయితే, కన్నా విషయంలో మాత్రం నిప్పు పుట్టాకే పొగ వచ్చిందని అంటున్నారు.

‘అబ్బే, అలాంటిదేమీ లేదు.’ అని పలు మార్లు కన్నా లక్ష్మినారాయణ ఈ తరహా గాసిప్స్ విషయమై ఖండించి పారేశారు. అయినా, ఆయన మీద ‘పార్టీ మారుతున్నారు’ అనే ప్రచారమైతే గట్టిగా సాగుతోంది. ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతోనే కన్నా మీద రాజకీయ పార్టీలు ప్రత్యేకమైన ప్రేమను ప్రదర్శిస్తుంటాయి.

కన్నా లక్ష్మినారాయణపై వైసీపీ ‘వల’కి కూడా అదే కారణమంటున్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకునే అవకాశమే లేదు. సో, ఆ పార్టీని ఎక్కువ కాలం పట్టుకుని వేలాడం వల్ల ప్రయోజనం లేదని కన్నా ఈపాటికే ఓ నిర్ణయానికి వచ్చేసి వుండొచ్చు.

ఇంతకీ, ఈ తాజా ప్రచారంపై కన్నా లక్ష్మినారాయణ తాజాగా ఎలా స్పందిస్తారో ఏమో.!