తెలంగాణ విముక్తి ఉత్సవాలు: బీజేపీ మాస్టర్ ప్లాన్.!

BJP

సెప్టెంబర్ 17.. తెలంగాణకు విమోచనం లభించిన రోజు. కాదు కాదు, తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు. కాదు కాదు, హైద్రాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. అసలు ఇది విమోచనమా.? విలీనమా.? విద్రోహమా.? ఇంకేమన్నానా.?
చాలా ఏళ్ళుగా తెలంగాణలో ఈ రచ్చ నడుస్తోంది. విముక్తి, విమోచన, విలీన, విద్రోహ.. ఇలా ఏవేవో పేర్లు ప్రచారంలో వున్నాయి.. తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి చాలా చెప్పి, అధికారంలోకి వచ్చాక లైట్ తీసుకుంది.

సరిగ్గా, ఈ పాయింట్ పట్టుకునే తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మాస్టర్ ప్లాన్ రచించింది భారతీయ జనతా పార్టీ. ఏకంగా ఏడాదిపాటు తెలంగాణ విముక్తి ఉత్సవాలు జరపాలని తెలంగాణ బీజేపీ నిర్వహించింది. ఆజాదీ కా అమృత మహోత్సవ్.. ఎలాగైతే జరుగుతోందే, అలాగే ఇది కూడా జరుగుతుందట.

అదేంటీ, ఆజాదీ కా అమృత మహోత్సవ్.. కేంద్రం కదా నిర్వహించేది.? అంటే, అదంతే.. ఇదింతే.! తెలంగాణ విముక్తి ఉత్సవాలకు కేంద్రం శ్రీకారం చుడితే ఆ తర్వాత ఏమవుతుందో బీజేపీకి బాగా తెలుసు. అందుకే, పార్టీ పరంగా ఆ కార్యక్రమాన్ని చేపడుతోందన్నమాట.

విమోచన, విద్రోహ, విలీన, విముక్తి.. ఇన్ని పేర్లలో ప్రస్తుతానికి బీజేపీ ‘విముక్తి’కి కమిట్ అయి వుందన్నమాట. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయట.