బీజేపీ అనుకున్నది జరిగితే… తెరాస పార్టీ చిత్తవటం ఖాయం ?

BJP's focus is now on the Nagarjuna Sagar by-election

అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ కాషాయ జెండా ఎగర వేయాలని ప్రయత్నిస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాలలో స్థానిక పార్టీల హవా ఎక్కువగా ఉండడంతో బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఫలించడం లేదు అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బిజెపి వ్యూహలు ఫలిస్తున్నట్లే తెలుస్తున్నాయి. వరుసగా జరుగుతున్నఎన్నికల్లో బీజేపీకి ఎంతో కలిసి వస్తూ ఉండడం తెలంగాణ ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతుండటం బీజేపీకి తెలంగాణ లో పాగా వేయడానికి సరైన సమయం అని చెప్పాలి.

 

దుబ్బాక లో ఉప ఎన్నికలు రాగా ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయాన్ని సాధించారు. ఈ క్రమంలోనే అటు వెంటనే జీహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికల రాగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఒకప్పుడు కేవలం నాలుగు స్థానాలతో మాత్రమే సరిపెట్టుకున్న బిజెపి ఇక ఇప్పుడు ఏకంగా నలభై ఎనిమిది స్థానాల వద్దకు చేరుకొని అధికార టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చింది.

 

దీంతో తెలంగాణ ప్రజలందరూ బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అన్నదానిపై బిజెపికి మరింత కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో తమ సత్తా చాటేందుకు మరో టార్గెట్ కూడా ఉంది. ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగిన రోజే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మృతి చెందారు అనే విషయం తెలిసిందే. అక్కడ మరో రెండు నెలల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక అక్కడ కూడా బిజెపి విజయం సాధించాలని వ్యూహాలు ప్రారంభించింది. ఒకవేళ అక్కడ కూడా బిజెపి సత్తా చాటింది అంటే ఇక తెలంగాణ ప్రజలందరూ టీఆర్ఎస్ పై వ్యతిరేకత మరింత పెరిగిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.