బీజేపీ పార్టీ అంటేనే హిందుత్వ వాదం.. హిందుత్వ వాదం అంటేనే బీజేపీ. నిజానికి భారతదేశం హిందూ దేశం అయినప్పటికీ.. దేశంలో హిందుత్వ ఎజెండాను మోస్తున్న పార్టీ బీజేపీయే. దేశంలో హిందుమతాన్ని కాపాడటమే కాదు.. దాన్ని విస్తరింపజేయడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంది బీజేపీ పార్టీ.
ఇక ఏపీ విషయానికి వస్తే.. ఏపీలో బీజేపీ హిందుత్వ ఎజెండానే ధ్యేయంగా ముందుకు సాగుతోందట. ఏపీలో హిందుత్వ ఎజెండాను రాష్ట్రంలో విస్తరింపజేయాలన్నదే బీజేపీ వ్యూహమట. ఈ మధ్యే దీని గురించి వార్తలు తెగ వస్తున్నాయి. అయితే.. ఏపీలో బీజేపీ ఒక్కటే మనుగడ సాధించలేదు. బీజేపీకి ఏపీలో గడ్డు పరిస్థితులే ఉన్నాయి ప్రస్తుతం కూడా. అందుకే.. ఏపీలో సీఎం జగన్ సహకారం తీసుకోవడానికి బీజేపీ సమాయత్తం అవుతోందట.
నిజానికి ఏపీ సీఎం జగన్.. బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. కేంద్రంలో కూడా బీజేపీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర బీజేపీ నాయకులతోను జగన్ కు సత్సంబంధాలు ఉన్నాయి. కానీ.. ఏపీలో పరిస్థితి వేరు. ఏపీలో బీజేపీ.. జగన్ కు ప్రతిపక్షమే.
అయినప్పటికీ.. కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని.. జగన్ సహకారంతో ఏపీలో హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికి బీజేపీ తహతహలాడుతోంది.. అంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే.. ఒక ప్రతిపక్షం బలపడేందుకు ఏకంగా ముఖ్యమంత్రి సాయం చేస్తారా? అనేదే. ఎందుకంటే.. ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. పార్టీకి సరైన నాయకులే లేరు. సడెన్ గా ఎన్నికలు వస్తే.. అన్ని నియోజకవర్గాల్లో బరిలోకి దింపడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో బీజేపీకి జగన్ ఎందుకు సాయం చేస్తారు? అనే ప్రశ్న ప్రతిఒక్కరిలో ఉత్పన్నమౌతోంది. అలా చేస్తే జగన్.. తన గొయ్యి తాను తీసుకున్నట్టే కదా.. అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తనకు, తన పార్టీకి నష్టం జరిగేలా జగన్ అలా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు.. ఏపీలో బీజేపీ ఎజెండాకు జగన్ మద్దతు ఇవ్వకపోవచ్చు.. అంటూ మరో వర్గం నుంచి వార్తలు వస్తున్నాయి.