అడవి దొంగ వీరప్పన్ స్మగ్లింగ్ చరిత్ర గురించి ప్రపంచానికి తెలిసిందే. తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టించిన వీరప్పన్ చివరికి 2004 లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. అయితే ఇప్పుడు అదే వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్ కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టం కట్టింది. తమిళనాడు యుమోర్చా విభాగం ఉపాధ్యాక్షురాలిగా విద్యా వీరప్పన్ ను బీజేపీ నియమించింది. వృత్తిరీత్యా విద్యా వీరప్పన్ న్యాయవాది అయిన ఆమధ్య బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఇక తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. రాజకీయ పార్టీలన్ని మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయంతఅంతకంతకు వేడెక్కుతోంది. ఇక బీజేపీ పార్టీ బలోపేతంలో భాగంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడులో బలోపేతం అయ్యేందుకు బీజేపీ నేతల వ్యూహంలో భాగంగా విద్యను సీన్ లోకి తీసుకొచ్చి రాష్ర్ట స్థాయిలో పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అలాగే పాత వీరప్పన్ వర్గాన్ని విద్య ఇప్పుడు బీజేపీ వైపు తిప్పేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏ రాష్ర్టంలో ప్రభుత్వం వీక్ గా ఉంటే అక్కడ కమలదళావాలు వాలిపోయి వాతావరణాన్నితమకు అనుకూలంగా మార్చుకుంటాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ర్టాల టార్గెట్ గా బిజీపీ పనిచేస్తోంది. ఇప్పటికే కర్ణాటకను కైవసం చేసుకున్నారు. తెలంగాణలోనూ జోరుగా పావులు కదుపుతోంది. ఆ రాష్ర్టంలో పార్టీ బలం గతం కన్నా ఇప్పుడు మెరుగు పడిందంటే కారణం కమలదళాల వ్యూహమే.