బీజేపీ ప్లాన్ సక్సెస్.. కేసీఆర్ మాటలలో ఈ మార్పును మీరు గమనించారా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ట్రాప్ లో పడ్డారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొన్ని నెలలుగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు అని కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ మినహా మరే రాష్ట్రంలో కేసీఆర్ సక్సెస్ అయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. కేసీఆర్ మోదీ సర్కార్ ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రాధాన్యతనిస్తోందని సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటోందని అన్నారు.

కేసీఆర్ ఢిల్లీ గద్దెపై మన ప్రభుత్వమే రానుందని 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైతే దేశంలోని రైతులందరికీ 24 గంటలు ఉచితంగా కరెంట్ అందేలా చూస్తానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ కామెంట్లకు అనుగుణంగా జాతీయ రాజకీయాలలో పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉపఎన్నికలో టీ.ఆర్.ఎస్. గెలుస్తుందో లేదో కచ్చితంగా చెప్పలేమనే పరిస్థితి నెలకొంది. మునుగోడులో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడవచ్చని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కేసీఆర్ దృష్టిని జాతీయ రాజకీయాలపై మళ్లించి తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. కేసీఆర్ మాటలు సైతం జాతీయ రాజకీయాలు టార్గెట్ గా ఉన్నాయి.

కేసీఆర్ మొదట తెలంగాణలో ఇబ్బందులు ఎదురుకాకుండా అడుగులు వేయాలని రాజకీయ విశ్లేషకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అధికారం ఎప్పుడూ ఒక పార్టీ చేతిలో ఉండదని తప్పటడుగులు వేస్తే టీ.ఆర్.ఎస్. కు ఇబ్బందులు తప్పవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టీ.ఆర్.ఎస్ కు తెలంగాణలో గట్టి పోటీ ఎదురవుతోంది.