ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మార్క్ (మత) రాజకీయం మొదలైందా అంటే, రాజకీయవిశ్లేషకులు అవుననే అంటున్నారు. అధికారం కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా మతపరమైన అంశాల్ని జాతీయ సమస్యగా చిత్రీకరించి, హిందూత్వ వాదుల్ని రెచ్చగొట్టి బీజేపీ అనేకసార్లు లబ్ధి పొందింది. ఈ క్రమంలో ఉత్తరాదిన ఉన్న అన్ని రాష్ట్రాల్లో మత రాజకీయంతోనే బీజేపీ గత ఎన్నికల్లో విజయం సాధించింది.
అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ ఇవే ట్రిక్స్ ప్లే చేస్తోందని, ఆ రాష్ట్రంలో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే అర్ధమవుతోంది. ఏపీలో రోజుకో చోట విగ్రహాలను అపవిత్రం చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం, రథాలు దగ్ధం అవడం, అలాగే రథాలకు అమర్చిన విలువైన వస్తువులు మాయమవడం, ఈ ఘటనలే ప్రస్తుతం ఏపీలో పునరావృతం అవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్రే దాగుందనే అనుమానం కలుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతున్న సంగతి తెలిసిందే. టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తర్వాత, ఏపీలో బీజేపీ ఒంటరిగా తన మార్క్ చూపించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, హిందూత్వ వాదం పేరుతో రాష్ట్రంలో బీజేపీ మత రాజకీయాలు స్టార్ట్ చేసిందనే కొందరి వాదన.
ఇక మరోవైపు ఏపీలో ప్రస్తుతం జరుగున్న విధ్వంసాలకు బీజేపీ కారణం అనే ఆధారాలు లేకపోయినా, ఈ విధ్వంసాలను అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్రంలో రాజకీయ వేడిని రగిలిస్తోంది మాత్రం బీజేపీనే అని చెప్పాలి. గత ఎన్నికల్లో బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని, మళ్ళీ బీజేపీతో కాపురం చేయాలని భావిస్తున్న టీడీపీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ విధ్వంస పరిస్థితులకు వెనుక నుండి సహకరిస్తోందనే విషయం అంతర్వేది ఘటనతో బయటపడింది.
ఏపీలో టీడీపీకి నామరూపాలు లేకుండా చేయడంతో, బీజేపీతో దోస్తీకి విశ్వప్రయత్నాలు చేస్తున్న క్రమంలో హిందూత్వ వాదాన్ని తెలుగుదేశం పార్టీ కూడా భూజానికెత్తుకుంది. ముఖ్యంగా అంతర్వేది ఘటనలో ఆందోళణ చేస్తున్న వారిలో టీడీపీ తమ్ముళ్ళే ఎక్కువగా ఉన్నారనేది అర్ధమవుతోంది. కుల రాజకీయాలు కాలం చెల్లడంతో, మత రాజకీయాలు తెరపైకి తెచ్చి టీడీపీ లాభపడాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రజలు అలాంటి దుష్ట శక్తుల మాయలో పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఏపీలో జగన్‌ను రౌండప్ చేసేందుకు, మత రాజకీయాల పేరుతో చేస్తున్న విద్శంసాలను ప్రజలు గమనించాలని, వారి మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.