రాజకీయాల్లో ఎదగాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక్క అవకాశం ఒక నాయకుడి లేదా రాజకీయ పార్టీ యొక్క చరిత్రను మార్చవచ్చు. ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలని, ఎదుగుతామని , రాష్ట్రంలో ప్రత్యాన్మయ శక్తిగా ఎదుగుతామని ఆ పార్టీకి చెందిన నాయకులు చెప్తున్నారు కానీ వాళ్ళు దానికి కోసం కృషి చేయడం లేదు, కష్ట పడటం లేదు. వాళ్ళు చెప్తున్నారు కానీ చేతల్లో చూపించడం లేదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన శ్రద్ధలో పదవ వంతు కూడా పార్టీపై ఆ పార్టీ నాయకులు పెట్టడం లేదు.
బీజేపీ మిస్ చేసుకున్న అవకాశం
విజయవాడలో శుక్రవారం రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రారంభోత్సవం చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి బెజవాడ కనకదుర్గ ఫ్లైవోవర్ కాగా రెండోది బెంజిసర్కిల్ వద్ద నిర్మించిన ఫ్లైవోవర్. అయితే ఈ ప్రాజెక్ట్ లను వైసీపీ నాయకులు బాగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు 355 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర సర్కారు 147 కోట్లు ఇచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు తమ పార్టీ ప్రచారం కోసం వాడుకుంటూ వైసీపీ కంటే ఎక్కువ ఆదరణ పొందవచ్చు కానీ బీజేపీ నాయకులు మాత్రం ఈ విషయంపై ఎక్కడ మాట్లాడటం లేదు. ఈ విషయంపై బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం జగనన్న కానుక మీద పవన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మోడీ జగనన్న కానుక అని పేరు పెడితే బాగుంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇలా బీజేపీ నాయకులు పార్టీకి ప్రజాదరణ పంచుకోవడానికి వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఈ విషయాన్ని గమనిస్తున్న ప్రజలు బీజేపీ నాయకులు నిద్రపోతున్నారా అని చర్చించుకుంటున్నారు.
కావాలనే చెప్పుకోవడం లేదా!
పార్టీకి కలిసి వచ్చే అంశాన్ని బీజేపీ నాయకులు అంత ఈజీగా వదలుకోరు. అలాంటి నేతలు ఇప్పుడు ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోవడం వెనక రాజకీయ వ్యూహం ఉందని రాజకీయ విమర్శకులు చెప్తున్నారు. చాలారోజుల నుండి జగన్ ను ఎన్డీయేలో కలుపుకోవడానికి మోడీ చాలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైనా ఇబ్బందులు వస్తాయని భావించే ఈ అవకాశాన్ని వదులుకున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.