ఎప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా బలపడాలని బీజేపీ నాయకులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ చాలా అనూహ్యంగా బలపడింది. అయితే ఏపీలో మాత్రం బీజేపీ ఇంకా తడపడుతూనే ఉంది. అయితే ఇక్కడ పార్టీ బలపడకపోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వల్లేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు.
బీజేపీ బలపడకపోవడానికి కారణాలు ఏంటి!
వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేస్తామని బీజేపీ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పదే పదే చెబుతున్నారు. అయితే అవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి. నిజానికి రాష్ట్రంలో పార్టీ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీనికి రెండు కీలక కారణాలు చెబుతున్నారు. ఒకటి రాష్ట్రంలో యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రెండు పార్టీలో ఔట్ డేటెడ్ నాయకులు తప్ప మరొకరు పెద్దగా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం లేనేలేదు. ఈ నేపథ్యంలో పార్టీ ఆశించిన మేరకు పుంజుకుంటుందా ? అనేది కీలక ప్రశ్న.
సోము కంటే సంజయ్ బెటర్
ఏపీ, తెలంగాణకు సోము వీర్రాజు, బండి సంజయ్ అధ్యక్షులుగా నియమితులు అవ్వడంతో ఇప్పుడు సహజంగానే వీరు ఎంత మేరకు సక్సెస్ అయ్యారన్నదానిపై కంపేరిజన్లు వస్తాయి. అయితే ఈ పొలికల్లో బండి సంజయ్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల సంజయ్ ప్రజల నుండి ఎక్కువ ఆదరణ పొందుతున్నారు.