ఏపీలో బీజేపీ టార్గెట్ అదేనా? అధికారంలోకి రావాలంటే అలా చేయాల్సిందేనా?

BJP

బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. ఇప్పటీకీ కొన్ని రాష్ట్రాల్లో పాగా వేయలేకపోతున్నది. నార్త్ ఇండియాలో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ.. సౌత్ ఇండియాలో మాత్రం బీజేపీకి ఇంకా గడ్డు పరిస్థితులే ఉన్నాయి. తన సామ్రాజ్యాన్ని విస్తరించాలంటే సౌత్ ఇండియాలో బీజేపీ ఎలాగైనా పట్టుసాధించాలని తాపత్రయపడుతోంది. ఒక్క కర్ణాటక తప్పించి మిగితా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రాంతీయంగా ఎందుకు పాపులారిటీ రావడం లేదు.. అని బీజేపీ పెద్దలు కూడా సమాలోచనలు చేస్తున్నారట.

bjp in ap trying caste politics

ఈనేపథ్యంలోనే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. దానిలో భాగంగా ఏపీలో ముందు బలపడేందుకు కొత్త సమీకరణాలకు తెర తీసింది. దీంతో బీజేపీ సరికొత్త రూట్ ఎంచుకొని అలా ఏపీలో బలపడాలని భావిస్తోంది.

అందుకోసం ఏకంగా కుల రాజకీయాలకు తెర తీసింది. ఏపీలో ప్రధానమైన వర్గం కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది. అందుకే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తాను అధ్యక్షుడు కాగానే.. వెంటనే కాపులను లైన్ లో పెట్టేందుకు యత్నించారు.

కేంద్రం నుంచి కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛ లభించడంతో.. ఏపీలో ఆయన ఆడిందే ఆట. అందుకే.. కాపు సామాజికవర్గాన్ని బీజేపీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే.. వెంటనే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను కూడా కలిశారు. అలా కాపు వర్గానికి చెందిన చాలామందిని కలవడంతో.. అందరి అనుమానం నిజమే అయింది.

కాపు వర్గంలో ఉన్న బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకొని ఆ దిశగా రాజకీయాలు చేసి ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ప్లాన్. దీంతో పెద్ద పెద్ద వాళ్లతో పాటు.. జిల్లాల్లో ఉండే కాపు నాయకులకు కూడా ఏపీ బీజేపీ గాలాలు వేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎలాగూ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆయనతో కలిసి మిగితా కాపు నేతలను బీజేపీలోకి లాక్కునేందుకు సోము వీర్రాజు ప్రయత్నాలు మొదలు పెట్టారట.

ఊరికే పార్టీలోకి లాక్కోవడం మాత్రమే కాదు.. వాళ్లకు పార్టీలోకి వస్తే కలిగే లాభాలను వివరించి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట. నిజంగా ఇది బీజేపీకి మంచి పరిణామమే. కానీ.. ఇది వర్కవుట్ అవుతుందా? కాపు నేతలంతా బీజేపీకి అట్రాక్ట్ అవుతారా? అయినా కూడా బీజేపీ పుంజుకుంటుందా? ఏపీలో అధికారం దిశగా పరుగులు తీస్తుందా? అంటే వేచి చూడాల్సిందే.