ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గ జనాభా ఎక్కువ.?

YS Jagan

ఎవరు ఔననా ఎవరు కాదన్నా జనాభా దామాషా ప్రకారం రాజకీయాలు నడవడంలేదు. ఎక్కువ జనాభా వున్న సామాజిక వర్గాలకు అసలు అధికారమే దక్కడంలేదు. మంత్రి పదవుల విషయంలో కొన్ని ఈక్వేషన్స్ పాటిస్తున్నారంతే.. అదీ మొహమాటంగా. పదవుల పంపకాల విషయంలో ఈక్వేషన్స్ బాగానే వున్నా, ఆయా పదవులకు వున్న పవర్స్ విషయంలో మళ్ళీ ఒక్కో సామాజిక వర్గానికీ ఒక్కోలా వుంటాయ్. ఇది ఓపెన్ సీక్రెట్ రాజకీయాల్లో.

కుప్పం నియోజకవర్గ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆ సామాజిక వర్గంలో అధికంగా వున్న బీసీల గురించి ప్రస్తావించారు. బీసీలు పోటీ చేయాల్సిన చోట చంద్రబాబుకి ఏంటి పని.? అని కూడా వైఎస్ జగన్ ప్రశ్నించేశారు. చాలా దఫాలుగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.

వైఎస్ జగన్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారన్నది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి, పులివెందులలో మెజార్టీ జనాభా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారేనని అనుకోవాలా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది మరి.! ఎస్సీ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలుంటాయ్‌గానీ, బీసీలకు రిజర్వుడు సీట్లు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి లేవు. మరెలా వైఎస్ జగన్ ఈ మాట అనగలిగారు.?

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ సామాజిక వర్గాలు.. మెజార్టీ జనాభా గురించి మాట్లాడారు గనుక, ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా తనను తాను ప్రశ్నించుకోవాలి కదా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది కదా.! అసలు ఇలాంటి విషయాలకు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారన్నది నిర్వివాదాంశం.