ఏపీలో రాజకీయ రుతుపవనాలు చాలా వేగంగా కదులుతున్నాయట.. ఎందుకంటే త్వరలో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. కాగా తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికతో ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఏపీలో పాలిటిక్స్ వేడివేడిగా సాగుతున్నాయి.. ఈ క్రమంలో ప్రతి రోజు ఏదో ఒక అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ పొలిటికల్ వార్ సృష్టిస్తున్నారు.. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం మాత్రం వైసీపీకే అనుకూలంగా ఉందంటున్నారు విశ్లేషకులు..
ఇకపోతే వైసీపీ ఆవిర్భావం నుంచి ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు చనిపోతే వారి కుటుంబంలోని ఒకరికి టికెట్ ఇస్తూ వస్తున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే అనేక సార్లు ఇలా చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లోనూ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం నుంచే ఒకరికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఎన్నికలను అడ్దం పెట్టుకుని రాజకీయంగా మరోసారి బీజేపీ అధిష్టానానికి దగ్గరవ్వాలని చంద్రబాబు ప్రయత్నిస్తుండగా, తిరుపతిలో ఎలాగు వైసీపీ నెగ్గడం ఖాయం మరి పోటీ చేసి పరువెందుకు తీసుకోవడం అని బీజేపీ ఆలోచిస్తుందట.. వాస్తవానికి వైఎస్ జగన్ బీజేపీకి ముందు నుండే సపోర్ట్‌గా ఉంటున్నాడు.. కాబట్టి ఒకరిని కాదని మరొకరు అడుగువేసే ప్రసక్తి ఉండదు.. ఈ దశలో టీడీపీ, వైసీపీ మధ్య పోరు జరగాలి కానీ అది సాధ్యం కాదని గ్రహించిన బాబు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడట..
ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు కేంద్ర బీజేపీ పెద్దల వ్యూహానికి వ్యతిరేకంగా వెళ్తున్నారనే భావన ఇక్కడ వ్యక్తమవుతోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో సోము అధికారాలకు కత్తెర పడిందని చెబుతున్నారు.. అదీగాక కీలకమైన కమ్మ సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్లడంలో సోము వీర్రాజు విఫలమవుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై దృష్టి పెట్టిన కేంద్రంలోని బీజేపీ నాయకులు తిరుపతి ఎన్నికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, దూకుడు తగ్గించి అనవసరమైన కామెంట్స్‌కు దూరంగా ఉండాలని హితవుపలికారట.. ఏది ఏమైన వైసీపీని తట్టుకుని నిలబడటం బీజేపీకి అంత సులువు కాదనే విషయం గ్రహించే పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.. లేదంటే బీజేపీ పరువు తీసుకున్నట్టుగా అవుతుంది.. ఒక వేళ ఇలా జరిగిందంటే ఇక్కడి గెలుపు ఏకపక్షం అవడం ఖాయం అంటున్నారు.. మరి చూద్దాం ఏం జరుగుతుందో..