దుబ్బాక ఉప ఎన్నికల వేడి రోజు రోజుకూ తీవ్రతరమవుతోంది. బీజేపీ, తెరాసాల మధ్యం మాటల యుద్ధ నడుస్తోంది. ఇటీవలే బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు కావల్సిన మనిషి ఇంట్లో డబ్బులు దొరికాయని పోలీసులు రఘునందన్ ఇంట్లో కూడ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రఘునందన్ రావు ఇంట్లో జరిగిన సోదాల గురించి తెలుసుకున్న బండి సంజయ్ సిద్దిపేటకు వెళ్లారు. అక్కడే సంజయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ కమిషనర్ తనపై చేయి చేసుకున్నారని బండి ఆరోపించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసిన బండి సంజయ్‌ని సిద్దిపేట నుంచి కరీంనగర్‌కి తరలించారు.
బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ బీజేపీ అట్టుడికిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు తెరాస మీద, కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. ర్యాలీలు, దీక్షలు చేశారు. ఈక్రమంలోకి తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు శ్రీను యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే పక్కనే ఉన్న వ్యక్తులు మంటలను ఆర్పారు. కాలిన గాయాలతోనే మీడియాతో మాట్లాడిన శ్రీను తనది రంగారెడ్డి జిల్లా అని, తాను బండి సంజయ్, రఘునందన్, అరవింద్ కోసం ప్రాణాలు అర్పిస్తానని అంటూ ఏయ్ కేసీఆర్ నువ్వు నా పార్టీను ఏమీ చేయలేవు అంటూ నినాదాలు చేశాడు.
BJP acticist burns himself infront of BJP party office
కార్యకర్త ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రచారంలో ఉన్న ఆయన వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరారు. శ్రీనుకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నేతలను ఆదేశించారు.