బీహార్ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఫస్ట్ నుంచి ఎన్డీఏ కూటమి ఆధిక్యం కనబరిచినా… మహాకూటమి కూడా ఎన్డీఏ కూటమికి గట్టి పోటీని ఇస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 130 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… మహాకూటమి 102 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇక.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. బీహార్ లో ముఖ్యంగా… ఎన్డీఏ, మహా కూటమి మధ్యే పోటీ నెలకొన్నది.
బీహార్ లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే.. జేడీయూ నేతకే మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తారా లేదా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే.. ఎన్డీఏ కూటమిలోని జేడీయూ పార్టీకి ముందు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. దాని హవా అంతగా లేదు. జేడీయూ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది.