కిల్లర్ టాస్క్ లో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన నటరాజ్ మాస్టర్.. షాక్ లో హౌజ్ మెట్స్..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో ఓటిటిలో ప్రసారమవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మునుపటి సీజన్ల లాగే ఈ సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షో ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ప్రస్తుతం 9 వారంలో కొనసాగుతోంది. ఈ వారం ఎపిసోడ్స్ అన్ని చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఈ మంగళ వారం కెప్టెన్సీ కంటెండర్స్‌ కోసం బిగ్ బాస్ ఇచ్చిన కిల్లర్ టాస్క్ లో భాగంగా నట రాజ్ మాస్టర్ ఐదు మర్డర్లు చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా టాస్క్ కంప్లీట్ చేసి అదరగొట్టాడు. ఈ ఒక్క టాస్క్ తో నట్రాజ్ మాస్టర్ ఓటింగ్ లో చాలా మార్పులు వచ్చాయి.

ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ కిల్లర్ గురించి అడగగా.. బిందు మాధవి శివ మీద అనుమానం ఉందని చెప్పగా.. అరియనా అఖిల్, ఆషూ పేర్లు చెప్పింది. ఆషూ రెడ్డి కూడా అఖిల్ మీద అనుమానం ఉన్నట్టు చెప్పింది. ఇక బాబా భాస్కర్ మాస్టర్ అనిల్ మీద అనుమాన పడ్డాడు. కానీ అక్కడున్న ఎవ్వరికీ నట్రాజ్ మాస్టర్ మీద కొంచెం కూడా అనుమానం కలగలేదు.

బిగ్ బాస్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో నట్రాజ్ మాస్టర్ కిల్లర్ అని ప్రకటించడంతో హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. బిగ్ బాస్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ నట్రాజ్ మాస్టర్ ఎవరికీ అనుమానం రాకుండా
టాస్క్ ఆడి మొదటి కెప్టెన్సీ పోటీదారుడు గా నిలిచాడు. హౌస్ లో ఉన్న వారందరూ అఖిల్, ఆషూ మీద అనుమాన పడగా.. కిల్ కిల్ కిలాడి అంటూ నటరాజ్ మాస్టర్ నవ్వుతూ ఎంట్రీ ఇవ్వటంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.