Avatar 2 Theatrical Trailer : బిగ్ అప్డేట్ : వరల్డ్ అవైటెడ్ “అవతార్ 2” ట్రైలర్ కి డేట్ కన్ఫర్మ్ అట.!

Avatar 2 Theatrical Trailer
Avatar 2 Theatrical Trailer :  ఈ ప్రపంచంలోనే బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయి వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం ఏది అంటే ఠక్కున “అవతార్” సినిమా అని అంతా చెబుతారు. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ ఫస్ట్ పార్ట్ ఎప్పుడో 2009 లో రిలీజ్ అయినా ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నో భారీ మల్టీ స్టారర్ లు సూపర్ హీరోలు సినిమాలు కూడా బ్రేక్ చేయలేకపోయాయి.
కానీ దానిని “అవెంజర్స్ ఎండ్ గేమ్” చిత్రం బ్రేక్ చేసింది కానీ మళ్ళీ అవతార్ రీ రిలీజ్ అయ్యి దానిని కూడా బద్దలు కొట్టేసి ప్రపంచం లోనే అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ అవతార్ సినిమాకి ఏకంగా ఐదు సీక్వెల్స్ ని సిద్ధం చేస్తున్న కెమరూన్ అందులో పార్ట్ 2 ని ఈ ఏడాది రిలీజ్ చెయ్యబోతున్నాడు.
మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందా అని అందరి లోనూ ఒకటే ఉత్కంఠ మరి ఫైనల్ గా ఈ సినిమాపై చిన్న ట్రీట్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా ఇప్పుడు సినీ ప్రపంచంలో ఓ టాక్ కోడై కూస్తుంది.
మరి ఈ సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ ని ఎక్స్ క్లూజివ్ గా మే 6న భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న చిత్రం “డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్” తో రిలీజ్ చేస్తున్నారని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో బిగ్గెస్ట్ అప్డేట్ సెన్సేషన్ గా మారింది. మొత్తానికి అయితే వరల్డ్ అవైటెడ్ సినిమా అయినటువంటి “అవతార్ 2” నుంచి పెను సంచలనం రేపే చిన్న ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి.