అవతార్ సిరీస్ ముగిసేసరికి 22 ఏళ్ళు

జేమ్స్ కామెరూన్ సినిమాలు అంటే టైటానిక్ అందరికి వెంటనే గుర్తుకొస్తుంది. తరువాత మళ్ళీ అంతగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి రీచ్ అయిన సినిమా అవతార్. ఈ మూవీ 2009లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. టెక్నాలజీ అప్పుడే ఇంకా వినియోగంలోకి వచ్చింది. అలాంటి టైమ్ లోనే మోషన్ క్యాప్చర్ లో కంప్లీట్ గా అవతార్ సినిమాని తెరకెక్కించడంతో పాటు పండోరా అనే ఓ అద్భుత ప్రపంచాన్ని అందరికి చూపించారు.

ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3 చిత్రాలలో అవతార్ ఒకటి. ఇప్పటి ఆ సినిమా రికార్డుని ఇతర హాలీవుడ్ సినిమాలు బ్రేక్ చేయలేకపోతున్నాయి. దీనిని బట్టి అవతార్ మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక గత ఏడాది అవతార్ 2లో వాటర్ వరల్డ్ ని జేమ్స్ కామెరూన్ చూపించారు. మొదటి సినిమాతో పోల్చుకుంటే అంత గొప్పగా ఏమీ లేదనే టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది.

ఇండియాలో వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి హాలీవుడ్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఇక వీటికి మరో మూడు సీక్వెల్స్ ని జేమ్స్ కామెరూన్ సిద్ధం చేస్తున్నాడు. వాటిలో అవతార్ 3 షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోగా, అవతార్ 4 చిత్రీకరణ స్టార్ట్ జరుగునదంట. ఇదిలా ఉంటే గతంలోనే అవతార్ సిరీస్ రిలీజ్ డేట్స్ ని జేమ్స్ కామెరూన్ ఎనౌన్స్ చేసేశారు.

అయితే ఇప్పుడు రిలీజ్ డేట్స్ మారాయి. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ టైమ్ ని ఎనౌన్స్ చేశారు. అవతార్ 3 మూవీ 2025 డిసెంబర్ 3 న రిలీజ్ చేస్తారంట, ఇక అవతార్ 4ని 2029 డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నారంట. అవతార్ 5 సినిమాని 2031 డిసెంబర్ 5న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారంట.

అంటే అవతార్ మొదటి పార్ట్ నుంచి చివరి సినిమాకి వచ్చే సరికి 22 ఏళ్ళు అయిపోతాయి. ఇక జేమ్స్ కామెరూన్ ఏజ్ కూడా 76లోకి వెళ్ళిపోతుంది. అయిన కూడా ఈ సినిమాలు అన్ని పూర్తి చేసిన తర్వాతనే దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకోవాలని జేమ్స్ కామెరూన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.