ఓటిటి : “అవతార్ 2” ఇండియా ఫ్రీ స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎందులో అంటే!

హాలీవుడ్ సినిమా దగ్గర నెంబర్ 1 దర్శకుడు అయినటువంటి జేమ్స్ కామెరాన్ తన అన్ని సినిమాలలో ఒకో దానికి సుమారు దశాబ్దం తీసుకున్నా కూడా తన సినిమాలను మళ్ళీ ఏ సినిమా కూడా అందుకోని విధంగా రికార్డులు సెట్ చేస్తుంటాయి.

మరి ఈ సినిమాలలో లాస్ట్ గా చేసిన అవతార్ అనే సినిమా రికార్డులు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. మరి దీనికి సీక్వెల్ గా అయితే అవతార్ 2 ను 13 సంవత్సరాలు తర్వాత రిలీజ్ చేయగా దీనికి కూడా రికార్డు వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర సుమారు 2.5 బిలియన్ డాలర్స్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లో సందడి చేస్తుంది.

వరల్డ్ వైడ్ గా పలు పాపులర్ ఓటిటి సంస్థల్లో స్ట్రీమింగ్  ఇప్పుడు వాటిలో డబ్బులు పెట్టి కొని చూడాలి. కానీ జస్ట్ సబ్ స్క్రిప్షన్ మాత్రం ఉండి చూడాలి అంటే ఎప్పుడు ఎందులో అనేది గాసిప్స్ తెలుస్తున్నాయి. ఈ సినిమా మెయిన్ డిజిటల్ హక్కులు హాట్ స్టార్ వారి దగ్గర ఉండగా అందులో అయితే ఇండియా వెర్షన్ కి గాను ఏప్రిల్ 28 డేట్ లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

అందులో ఆరోజు నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ కూడా అన్గాన్ని భాషల్లో ఉండే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. సో మొత్తానికి అయితే ఈ క్రేజీ సినిమా ని ఓటిటి లో చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే వారు మాత్రం ఇంకో నెల ఆగక తప్పదు.