‘బిగ్’ లేడీ నారద: అరెరే.. ఏంటిది.. ప్రియా ఆంటీ.!

బిగ్‌బాస్‌లో నారదుడు, గుంటనక్క వంటి ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్ రవి.. ఇప్పుడిప్పుడే ఆ ఇమేజ్ నుంచి బయటికొచ్చి తన గేమ్ తాను ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. తన వంతు ఎంటర్‌టైన్‌మెంట్‌కీ తెర లేపాడు. ఇదిలా ఉంటే, మరో కంటెస్టెంట్ అయిన ప్రియ ఆంటీ ఇప్పుడు రవి పాత్రలోకి పరకాశ ప్రవేశం చేసింది.

యాంకర్ రవిని మించిపోయేలా పుల్లలు పెట్టేస్తోంది. సన్నీని టార్గెట్ చేసి, కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఆటిట్యూడ్ ప్రదర్శిస్తోంది. ఆడేది తక్కువయినా, స్ర్కీన్ స్పేస్ కోసం చేయాల్సిన గ్యాంబ్లింగ్స్ అన్నీ చేస్తోంది.

ఇక, గతంలో రవికీ, లహరీకి మధ్య లింకు పెట్టేసి పెద్ద ఇష్యూ చేసిన సంగతి తెలిసిందే. పాపం ఆ కారణంగా లహరి ఏకంగా హౌస్ నుండే బయటికి వెళ్లిపోవల్సి వచ్చింది కూడా. తాజాగా ఇప్పుడూ అలాంటి ట్రాక్‌నే తెర పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రియమైన ప్రియ ఆంటీ.

ఈ సారి కాజల్‌కీ, శ్రీరామ్ చంద్రకీ లింకు పెట్టేసింది. క్యూట్ క్యూట్‌గా శ్రీరామ్ వెంట పడుతోంది.. శ్రీరామ్‌ని తన చుట్టూ తిప్పుకోవడానికి ట్రై చేస్తోంది.. అంటూ కాజల్‌పై అనవసరమైన ఆరోపణలు చేసింది. పింకి నేపథ్యంలో జరిగిన ఈ ఆరోపణలు హౌస్‌లో ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో చూడాలిక.